/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz స్వయంగా రంగంలో దిగిన హైడ్రా కమిషనర్ Raghu ram reddy
స్వయంగా రంగంలో దిగిన హైడ్రా కమిషనర్

భారీ వర్షాలతో హైదరాబాద్ బెంబేలెత్తుతోంది. అతలాకుతలమౌతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.

భారీ వర్షాల ధాటికి అమీర్‌పేట్, బేగంపేట్, షేక్‌పేట్, టోలీచౌకీ, గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్ వంటి ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురుగునీరు, వరదనీటి పారుదల కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల అవన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి.. నగరవాసులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడం, రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు- అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కోరారు.

రోడ్లపై నిలిచిన వర్షపునీటిలో పిల్లలు, వృద్దులు ఒంటరిగా బయటికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించవద్దని సూచించారు. వర్షపు నీరు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో స్థానికులు తమ పరిధిలో ఉన్న మ్యాన్ హోల్స్‌ను తెరవకూడని అన్నారు. ఒకవేళ అవి తెరచి ఉంటే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు.

ఈ పరిస్థితుల మధ్య హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. షేక్‌పేట్, టోలీచౌకీల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో కలియదిరిగారు. విధి నిర్వహణలో నిమగ్నమైన సిబ్బందితో మాట్లాడారు. వర్షపునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఇతర విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని అన్నారు.

సూర్యాపేటలో సాగర్‌ ఎడమ కాలువకు గండి..

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ఎడమ కాలువకు గండి పడింది. మండలంలోని రామచంద్రాపురం వద్ద కాలువకు గండి పడి కట్ట కొట్టుకుపోయింది. దీంతో పంట పొలాల ద్వారా గ్రామంలోకి వరద నీరు చేరుతున్నది. గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గత నెల 6న కూడా సాగర్‌ లో లెవల్‌ కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా అనుముల మండలం మారేపల్లి వద్ద కాలువకు గండిపడటంతో నీరు పొల్లాలోకి చేరింది.

ఇక మూసీ ఎడమ కాలువకు కూడా గండి పడింది. ఆదివారం మధ్యాహ్నం పిల్లలమర్రి, పిన్నాయిపాలం మధ్య ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నీరు వృధాగా పోతున్నది. దీంతో సమీపంలోని పంటపొలాల్లోకి వరద నీరు పోతున్నది. గండిపడిన ప్రదేశానికి ఇరిగేషన్‌ అధికారులు చేరుకున్నారు. గండిని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారు.

బెజవాడను ముంచెత్తిన భారీ వర్షం.. 200 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ కోస్గా తీరంలో ఎటుచూసినా వర్షాలే వర్షాలు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందన్న ఐఎండీ సూచనలతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో జిల్లాలకు విపత్తు నిధులను విడుదల చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయంకావడంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షంతో వరుణుడు కుంభవృష్టి కురిపించాడు. దీంతో 30 ఏళ్ల కిందటి రికార్డు బద్ధలయ్యాయి. రహదారులన్నీ ఏరులయ్యాయి. ఏకధాటి వర్షాలకు మొగల్రాజుపురంలో కొండచరియలు ఇళ్లపై విరిగి పడి.. ఆరుగురు మృతి చెందారు.

బెంజిసర్కిల్‌లో 161 మిల్లీమీటర్లు, గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు ఏపీకి చెందిన ప్రముఖ వాతావరణ నిపుణుడు కే ప్రణీత్ తెలిపారు. ఈస్థాయిలో ఆగస్టులో వర్షం కురువడం 200 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని అన్నారు. తాడేపల్లిలో 121 మిల్లీమీటర్లు, మంగళగిరిలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సరిగ్గా పాతికేళ్ల కిందట 1999లో ఈ స్థాయిలో వరదనీరు, వర్షపునీరు నగరంలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో కృష్ణానది వెంట కరకట్టలు తెగిపోయేలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

బుడమేరు సైతం నాడు పొంగి అనేక ప్రాంతాలు మునకేశాయి. నాటి పరిస్థితులు తలిపించేలా ఇప్పుడు విజయవాడ నగరం వర్షపునీటితో మునిగిపోయింది. రహదారులు, డ్రెయిన్లు ఏకమై.. పలు ప్రాంతాల్లో వర్షపునీరు 2-6 అగుడుల ఎత్తున నిలిచిపోయింది. శివారు ప్రాంతాలు, కాలనీలు పూర్తిగా నీటమునిగాయి

పదుల సంఖ్యలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరడంతో పలు కుటుంబాలు ఖాళీచేసి బంధువులు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ట్రాకులపై వరద నీరు చేరింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది.భారీ వర్షాలకు బుడమేరు పొంగిపొర్లడంతో కొండపల్లి మండలం శాంతినగర్ ఇందిరమ్మ కాలనీని వరదనీరు ముంచెత్తింది. శనివారం రాత్రి సుమారు 200 కుటుంబాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వీరిని రక్షించేందుకు అక్కడ చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాత్రివేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినా.. అధికారులు మాత్రం జేసీబీల సహాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల కోసం వెళ్లిన ఓ మత్స్యకారుడి బోటు సహితం గల్లంతైంది. బోటులోని మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు.

ఏపీలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కాగా, జేసీబీలు, పొక్లెనర్లతో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మట్టి పెళ్లలు ఇంకాపడుతున్నాయి. మట్టిపెళ్లలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో జేసీబీలు, పొక్లెనర్లను సిబ్బంది వెనక్కు తీసుకెళ్లారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్న స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొండ చరియలు మరింతగా పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అలాగే క్రీస్తురాజపురంలో రెండు ఇళ్లపై కొండచరియలు పడ్డాయి. సున్నపుబట్టీల దగ్గర కొండచరియలు పడి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్లల్లో చిక్కుక్కున్న వారిని భయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు.

జల దిగ్బందంలో మైలవరం పట్టణం ఉండిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. మైలవరం ఎర్ర చెరువుకు గండి, తారక రామనగర్‌‌‌‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మైలవరం ప్రధాన సెంటర్‌‌లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. మైలవరంలో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చండ్రగూడెం శివారు జంగాలపల్లిలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. కొండ వాగు ఉధృతికి మైలవరం - పొందుగల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బుడమేరు వరద అంతకు అంత పెరుగుతోంది.

చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.

హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మొత్తానికి అధికారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ వింగ్ అధికారులు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన అధికారులు ఉన్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్.. బాచుపల్లి ఎంఆర్ఓ‌పై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజకుమార్ పై కేసు నమోదైంది. హైడ్రా సిఫారసుల మేరకు ఆయా అధికారులపై కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కేసులను సీపీ అవినాష్ మహంతి నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు అయ్యాయి. అదనపు సిబ్బందితో హైడ్రా మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ సైతం ఏర్పాటు కానుంది. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించగా.. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ కానున్నాయి. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్‌లో చేర్చి మరీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను సిద్ధం చేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు ఆరుగురిపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మరోవైపు మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుళ అంతస్థు భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన ముగ్గురు బిల్డర్స్‌పై కేసులు నమోదయ్యాయి. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులుపై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఈర్ల చెరువులో అక్రమంగా బహుళ అంతస్తులను ముగ్గురు బిల్డర్స్ నిర్మించారు.

తెలంగాణలో కొత్త జూ పార్క్.. వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు, ఎక్కడంటే..?

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నెహ్రూ జూ పార్క్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 300 ఎకరాలకు పైగా విస్తరించిన ఉన్న ఈ జూలో పులులు, సింహాలతో పాటు వందల అరుదైన వన్యప్రాణులు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తెలంగాణలో త్వరలోనే కొతత్ జూ పార్క్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1000 ఎకరాల్లో జూ పార్క్ నిర్మించాలని ఆదేశించారు.

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలన్నారు. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు.

కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జూ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. నగరం వెలుపల దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్ నగర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలన్నారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!

టీపీసీసీ చీఫ్ పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది.

టీపీసీసీ చీఫ్ (TPCC Chief) పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. మూడు రాష్ట్రాలను పీసీసీ చీఫ్‌లను ఏఐసీసీ ప్రకటించనుంది.

ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్సీ, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైంది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ఉండనున్నారు. మూడు రాష్ట్రాలకు ఖరారైన నూతన పీసీసీ చీఫ్‌ల పేర్లను నేడో, రేపో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.

కాగా... తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌ గౌడ్ పేరును హైకమాండ్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ గౌడ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. బొమ్మ మహేష్ గౌడ్.. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మహేష్ గౌడ్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ఏ తరుణంలోనూ వదిలిపెట్టలేదు. పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఇంత కాలానికి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలా సామాజిక సమీకరణాలు అన్నీ మహేష్‌కు కలిసొచ్చినట్టుగా సమాచారం.

కోహ్లీ, రోహిత్ శర్మలకు పాకిస్థాన్ మాజీ స్టార్ ఆటగాడి కీలక విజ్ఞప్తి

ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్లి ఆడినా వీరిద్దరికీ ఫ్యాన్స్ మద్దతు ఇస్తుంటారు. అయితే క్రికెట్ ఆడే ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్‌లో వీరిద్దరూ ఒక్కసారి కూడా పర్యటించలేదు. 2012-13లో పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇక భారత్ 2006లో చివరిసారిగా పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. అప్పటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో వీరిద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్‌లో ఆడలేదు.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భారత జట్టు పాల్గొనడంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్టార్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్ అయ్యే ముందు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలు ఒకసారి పాకిస్థాన్‌ సందర్శనకు రావాలని కోరాడు. పాకిస్థాన్‌లో వీరిద్దరికి లభించే ప్రేమ, అభిమానాలు అన్నింటినీ మించిపోతాయని అక్మల్ వ్యాఖ్యానించాడు.

ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ స్టార్‌ ఆటగాళ్లని, క్రికెట్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యటిస్తున్నారని అక్మల్ అన్నాడు. ‘‘ప్రతి క్రికెట్ ఫ్యాన్ వారిని అభిమానిస్తుంటారు. వారి అద్భుతమైన బ్యాటింగ్, మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనల కారణంగా ఇద్దరికీ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్థాన్‌లో వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా అన్ని చోట్లా చూసిన దానిని మించిపోతుంది’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కోహ్లీ ఒక ఆదర్శవంతమైన క్రికెటర్ అని, పాకిస్థాన్‌లో అతడికి అపూర్వమైన ఆదరణ లభిస్తుందని అక్మల్ పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలో చాలా మందికి విరాట్ కోహ్లీ రోల్ మోడల్. రోహిత్ శర్మప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్. ఈ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో పర్యటిస్తే ఇక్కడ అందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. విరాట్ అండర్-19 రోజులలో పాక్‌కు వచ్చాడు. కానీ అప్పుడు అతడికి అంత ఆదరణ లేదు’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ అండర్-19 క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. అయితే అప్పటికి కోహ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

శంషాబాద్ లో ల్యాండ్ అయిన ఆకాశ తిమింగలం

ఆకాశ తిమింగలంగా పేరున్న ఎయిర్ బస్ సరకుల రవాణా ఎయిర్ క్రాఫ్ట్ తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి వచ్చింది. గురువారం అర్థరాత్రి ల్యాండ్ అయిన ఈ విమానం శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లిపోయింది. ఇంత భారీ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మొదటిసారి ల్యాండ్ కావటంపై ఆసక్తి వ్యక్తమైంది. 56.16 మీటర్ల పొడవు.. 17.25 మీటర్ల ఎత్తుతో పాటు.. రెక్కలు 44.84 మీటర్లు ఉంటాయి.

ఈ భారీ విమానంలో ఏకంగా 40 టన్నుల (ఒక టన్నువెయ్యి కేజీలు)సరకుల్ని రవాణా చేసే సామర్థ్యం దీని సొంతం. ఇంధనం లేకుండా ఈ భారీ విమనం బరువు 133.8 టన్నులు కాగా.. ల్యాండింగ్ బరువు 140 టన్నులు. టేకాఫ్ బరువు 155 టన్నులు. ఇందులో ఒకసారి 23,860 లీటర్ల ఇంధనాన్ని నింపొచ్చు. ఒకసారి ఇంధనాన్ని నింపిన తర్వాత నాన్ స్టాప్ గా 1650కి.మీ. దూరం ప్రయాణించే సత్తా దీని సొంతం.

ఇక.. దీని ఎత్తు విషయానికి వస్తే.. లో డబుల్ క్రాస్ సెక్షన్ ఎత్తు 71. మీటర్లుకాగా.. లో డబుల్ క్రాస్ సెక్షన్ వెడల్పు 7.1 మీటర్లుగా చెబుతున్నారు. ఇంతకు ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వేస్తే.. ఆసక్తికర సమాధానం వస్తుంది. నిజానికి ఈ ఎయిర్ బస్ విమానం మస్కట్ లో బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఇది థాయ్ లాండ్ లో సరకుల్ని లోడింగ్ కోసం వెళ్లాల్సి ఉంది.

అయితే.. మధ్యలో ఈ విమానం ఇంధనం నింపుకోవటంతో పాటు.. క్రూ సిబ్బంది విశ్రాంతి తీసుకోవాల్సి రావటంతో విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్ కు తీసుకొచ్చారు. శంషాబాద్ లో ల్యాండింగ్ చేసిన తర్వాత 15 గంటల పాటు ఇది ఎయిర్ పోర్టులోనే ఉంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వేళలో థాయ్ లాండ్ కు బయలుదేరింది. ఈ బాహుబలి లోహ విహంగం 2022 డిసెంబరులోనూ.. 2023 ఆగస్టులోనే వచ్చింది. తాజాగా మరోసారి ఆగస్టు నెలలోనే శంషాబాద్ కు రావటం ఆసక్తికరం.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో శని, ఆదివారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావ‌ర‌ణ‌ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.