/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ.. Mane Praveen
TS: బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన రాములమ్మ..

తెలంగాణ బీజేపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బిజెపి పార్టీకి సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా బీజేపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా రాజీనామా చేశారు. 

ఇక విజయశాంతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న విజయశాంతి.. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గత రెండు సంవత్సరాల కిందట బీజేపీ పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు బీజేపీ కి కూడా రాజీనామా చేశారు.

NLG: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఎన్జీ కళాశాలలో పుస్తక సమీక్ష - రీడతన్

నల్లగొండ: పట్టణ కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో.. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పుస్తక సమీక్ష మరియు రీడతన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ ఎన్ దీపిక మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు పుస్తకం చదివే విధానాన్ని మరియు సమీక్షించే విధానాన్ని పుస్తకం మొత్తం చదివినప్పుడు మాత్రమే తెలుస్తుందని, విషయం మొత్తం అర్థం చేసుకున్నాక సబ్జెక్టు కవరేజ్, రచన శైలి, ఉపయోగించిన భాష ఆధారంగా సమీక్షించవచ్చని తెలిపారు. 

డాక్టర్ వెల్దండి శ్రీధర్ వక్తగా మాట్లాడుతూ.. రచన శైలి ఒక కళని, గొప్ప పాఠకుడికి రచించే తత్వం అలవడుతుందని, ఏదైనా విషయం ఎంచుకొని రచన చేసేటప్పుడు ఆ విషయం పైన పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే.. ఒక పుస్తకాన్ని రచించవచ్చని, ఆ రచనలు విషయానికి తగ్గట్లుగా సమాచారాన్ని రచించవచ్చని తెలిపారు. 

ఆ తదుపరి విద్యార్థులకు రీడతాన్ మరియు స్వీట్ రీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కళాశాల విద్యార్థిని, విద్యార్థులు చాలా ఆసక్తిగా వేగవంతంగా చదవడం పోటీలో పాల్గొన్నారని కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు , మరియు మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: పి ఆర్ టి యు తెలంగాణ..నల్లగొండ జిల్లా కోశాధికారిగా అద్దంకి సునీల్ కుమార్..

నల్లగొండ: పి ఆర్ టి యు తెలంగాణ సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మల్టీజోన్ వన్ లో టీచర్ల ట్రాన్స్ఫర్లు జరిగాయని, మల్టీజోన్ రెండు లో కోర్టు కారణాలు వలన ట్రాన్స్ఫర్లు ఆగిపోయాయని.. పి ఆర్ టి యు తెలంగాణ.. మల్టీజోన్ రెండు లో ట్రాన్స్ఫర్ ల కొరకు పనిచేస్తుందని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల కొరకు నిరంతరం పనిచేస్తుందని వారన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో సుంకరి భిక్షంగౌడ్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటామని అన్నారు.

తదుపరి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులు గా రామచంద్రారెడ్డి,

ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ గౌడ్, గౌరవ అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బిక్షపతి, కోశాధికారిగా అద్దంకి సునీల్ కుమార్.. ను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, కోర్ కమిటీ సభ్యులు మా రెడ్డి వెంకట్ రెడ్డి, జనగాం వెంకట్ గౌడ్, , మాజీ ప్రధాన కార్యదర్శి శంకర్, వనం లక్ష్మి పతి, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, చింతల వెంకటేశ్వర్లు, యోగానంద్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు

NLG: మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి


నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాలిందిని మండల కార్యాలయంలో ఎంపీడీవో, ఏపీవో, టిఏ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం రాజపేట తండాలో నర్సరీ నిర్వహణ మీద ఎఫ్. ఏ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కూలీల వేతన చెల్లింపులు, కూలీలకు మొబైల్ అటెండెన్స్ నిర్వహణ మీద ఉపాధి హామీ పనుల మీద సమీక్ష సమావేశ నిర్వహించారు.

కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఏపీఓ వెంకటేశం టిఏ లు, ఈసి, పంచాయతీ సెక్రటరీ ప్రణీత, తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్: గడప గడపకు ప్రచారం చేస్తున్న మేడి ప్రియదర్శిని


బహుజన రాజ్యం బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ తోనే సాధ్యమని, నకిరేకల్ బి ఎస్ పి ఎమ్మెల్యే అభ్యర్ధి మేడి ప్రియదర్శిని అన్నారు. బుధవారం నకిరేకల్ మండలం మొడుగు గూడెం, గోరింకలపల్లి, గ్రామాలల్లో ఇంటింటికి తిరుగుతూ ఏనుగు గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ..  నకిరేకల్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం లు నిర్మించినా.. పేదలకు ఎందుకు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు.

జనాభాలో 90 శాతం ఎస్సీ, ఎసీబీసీ, మైనార్టీలు ఏకమైనప్పుడే బహుజనుల రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విద్యావంతురాలైన తనకు ఎన్నికల్లో ఒక అవకాశం ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తానాని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, జోగు శేఖర్, యశ్వంత్, శ్రీరామ్, మహేష్, కృష్ణ, మహేష్, సురేష్, మల్లేష్, బి ఎస్ పి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

TS: నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు..

నేడు నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం కావడంతో ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థుల నామినేషన్లు విరమించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు మొత్తం 13 చోట్ల రెబల్స్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ 13 నియోజకవర్గాల్లో ప్రధాన నేతలే ఎన్నికల బరిలో ఉండటంతో.. రెబల్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అగ్రనాయకత్వం బుజ్జగింపులు చేపట్టింది. అధికారంలోకి రాగానే పదవులు ఇస్తామని చెబుతుంది.

అదేవిధంగా బీఆర్ఎస్ కు రెబల్స్ అభ్యర్థులు పెద్దగా లేరు కానీ, సిఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధిక నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు రంగంలోకి దిగి నామినేషన్లను ఉపసంహరించుకుంటే డిమాండ్లను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే 28 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇంకా 80 మంది వరకూ బరిలో ఉన్నారు. దీంతో ఆఖరి ప్రయత్నాలను అధికార పార్టీ చేస్తుంది. ఎన్ని నామినేషన్లు ఉపసంహరించుకున్నది అనేది రేపటికి తెలుస్తుంది.

NLG: దర్వేశిపురంలో జాతరలా కాంగ్రెస్ ప్రచారం

నల్గొండ: కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం లోని దర్వేశిపురం గ్రామం వచ్చారు. 

ఈ గ్రామం రేణుక ఎల్లమ్మ తల్లి కొలువుదీరిన ప్రాంతం. ఆదివారం, మంగళవారం ఈ ప్రాంతమంతా భక్తుల సందడితో జాతర లాగా ఉంటుంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు, కార్యకర్తలు జాతరలా తరలివచ్చారు. చూసేవారికి ఎల్లమ్మ జాతరే జరుగుతోందా అన్నట్లుగా ఈ ప్రాంతమంతా జన సందడి నెలకొని ఉంది. 

ప్రచారంలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేదలకు సొంత ఇళ్ళు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తాను మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తొలుత ఈ ఊరికే వచ్చి అమ్మ వారిని మొక్కుకుంటాను అని చెప్పారు.

నల్లగొండ: ఇందిరమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ నియోజకవర్గం:

నల్గొండ మున్సిపాలిటీ:

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రచారంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మరియు పలువురు కౌన్సిలర్లు..

నల్గొండ: మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీ, వెంకట రమణ కాలనీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీపీసీసీ స్టార్ క్యాంపైనర్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు, నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..

ఇందిరమ్మ కాలనీ లో 120 ఇళ్ల పట్టాలు ఇచ్చిన...

60 పైగా ఇల్లు కట్టిచ్చిన..

ఇక్కడ ఒక కాలనీ ఉంది అని స్థానిక ఎమ్మెల్యే కి తెలియదని విమర్శించారు.

కాలనీ లో రోడ్లు విస్తరిస్తాను..

నీళ్లు ప్రతి రోజు వచ్చేలా చూస్తా..

కౌన్సిలర్ జానయ్య బాగా పని చేస్తాడు..

కుటుంబ పెద్ద కోల్పోయిన రేణుక పిల్లలని చదివిస్తా..అని అన్నారు

ఈ కాలనీలో నివసించే వారు మొత్తం పేద ప్రజలు..

మీ అందరికి మాట ఇస్తున్న నల్గొండ చుట్టుపక్కల నివాసం ఉంటున్న పేద ప్రజలకి ఇల్లు కట్టిస్తా..అని హామీ ఇచ్చారు.

అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డు తో పాటు 9 రకాల సరుకులు ఇస్తాము..

అధికారం వచ్చిన 3 నెలల్లో మీ కాలనీ రూపురేఖలు మారుస్తా..

ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి.. అందరూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

TS: రాష్ట్రంలో 72 శాతం మంది ఓటర్లు 49 సం. లోపు వారే..

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఓటర్ల తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 49 ఏండ్ల లోపు ఓటర్లు 72 శాతం ఉన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు నమోదయ్యారు.

కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

శేరిలింగంపల్లి లో అత్యధిక ఓటర్లు.. భద్రాచలంలో అత్యల్పం

మేడ్చల్‌ నియోజకవర్గంలో అత్యధికంగా కొత్త ఓటర్లు

కొత్త ఓటర్లు, ఓటర్ల వయస్సు, నియోజకవర్గాలవారీగా ఓటర్ల సంఖ్య తదితర వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,62,98,418 మంది పురుషులు కాగా, మహిళలు 1,63,01,705 ఉండగా ట్రాన్స్‌జెండర్లు 2,676 మంది ఉన్నారు. ఓటర్లలో 59 ఏండ్లలోపు వారు 86 శాతం ఉన్నట్టు వెల్లడైంది.అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా శేరిలింగంపల్లి (7,32,506) నిలిచింది.

ఆ తరువాత కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 6,99,130 ఓటర్లు ఉన్నారు. అతి తక్కువ సంఖ్యలో భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నారు. ఆ తరువాత అశ్వరావుపేట, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు ఉన్నాయి. 80 ఏండ్లు దాటినవారు 4,40,371, దివ్యాంగులు 5,06,921 మంది ఉన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందిన 18, 19 సంవత్సరాల వయస్సు వారు 9,99,667 మంది ఉన్నారు. వీరిలో 5,70,274 పురుషులు కాగా మహిళలు 4,29,273 ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 120 మంది ఉన్నారు. కొత్త ఓటర్లు అత్యధిక సంఖ్యలో నమోదైన నియోజకవర్గాలలో కూడా మేడ్చల్‌ (17,012) మొదటిస్థానంలో నిలిచింది.

పురుషులకంటే మహిళలే అత్యధికం

వయస్సుల వారీగా ఓటర్ల వివరాలు

వయస్సు : ఓటర్లు

18-19 : 9,99,667

20-29 : 64,36,335

30-39 : 92,93,392

40-49 : 66,96,089

50-59 : 45,66,306

60-69 : 27,72,128

70-79 : 13,98,511

80+ : 4,40,371

మొత్తం : 3,26,02,799

అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గం : ఓటర్లు

భద్రాచలం : 1,48,661

అశ్వరావుపేట : 1,55,961

బెల్లంపల్లి : 1,73,335

చెన్నూరు : 1,88,283

వైరా : 1,93,069

బాన్సువాడ : 1,95,191

దుబ్బాక : 1,98,100

పినపాక : 1,98,402

జుక్కల్‌ : 1,99,962

అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గం : ఓటర్లు

శేరిలింగంపల్లి : 7,32,506

కుత్బుల్లాపూర్‌ : 6,99,130

మేడ్చల్‌ : 6,37,839

ఎల్బీ నగర్‌ : 5,93,712

రాజేంద్రనగర్‌ : 5,81,937

మహేశ్వరం : 5,46,577

ఉప్పల్‌ : 5,29,416

మల్కాజిగిరి : 4,89,043

కూకట్‌పల్లి : 4,63,864

పటాన్‌చెరు : 3,97,237

18, 19 ఏండ్ల వారు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గం : యువ ఓటర్లు

మేడ్చల్‌ : 17,012

కుత్బుల్లాపూర్‌ : 15,117

రాజేంద్రనగర్‌ : 14,094

మహేశ్వరం : 14,039

ఖమ్మం : 13,599

ఎల్బీనగర్‌ : 12,569

మునుగోడు : 12,523

గద్వాల : 12,385

ఇబ్రహీంపట్నం : 12,757

వనపర్తి : 12,073

80 ఏండ్లు దాటిన వారు అత్యధికంగా ఉన్న సెగ్మెంట్లు

నియోజకవర్గం : ఓటర్లు

మల్కాజిగిరి : 10,128

ఎల్బీనగర్‌ : 8,478

శేరిలింగంపల్లి : 8,102

మలక్‌పేట : 7,871

ఉప్పల్‌ : 7,553

మహేశ్వరం : 7,019

ముషీరాబాద్‌ : 6,780

కంటోన్మెంట్‌ : 6,395

యాకత్‌పుర : 6,201

సనత్‌నగర్‌ : 5,931

దివ్యాంగులు అధికంగా ఉన్న నియోజకవర్గాలు

నియోజకవర్గాలు : ఓటర్లు

కోరుట్ల : 11,530

ధర్మపురి : 11,102

జగిత్యాల : 9,759

మహేశ్వరం : 8,362

మానకొండూరు : 7,009

హుజూరాబాద్‌ : 6,931

మేడ్చల్‌ : 7,405

ఇబ్రహీంపట్నం : 7,322

వనపర్తి : 6,382

ఎల్బీనగర్‌ : 6,064

NLG: ప్రజాస్వామ్య, సామాజిక లౌకిక పోరాడే శక్తులను గెలిపించండి:ఆనంద్

కొండ మల్లేపల్లి: మండల కేంద్రంలో బిజెపి దాని మిత్రులను తిరస్కరించి, లౌకిక ప్రజాస్వామ్య సామాజిక పోరాట శక్తులను బలపర్చాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ పిలుపునిచ్చారు.

మండల కేంద్రంలో పాత బజారు బొడ్డు రాయి కాలనీ పార్టీ శాఖ సమావేశంలో కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్, ఎంఐఎం ప్రత్యక్షంగా పరోక్షంగా బిజెపి సహకరిస్తున్నాయని అందుకనే మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను అరెస్టు చేయలేదని విమర్శించారు. మోడీకి వ్యతిరేకంగా ఉండే పార్టీపై, సంస్థలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని విమర్శించారు. బిజెపి మత రాయకీయాలను ప్రోత్సహించి, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసే, కుల మత తగాధలను రెచ్చగొడుతూ దేశ ఐక్యతను విచ్చినం చేస్తున్న బిజెపి దాని మిత్రులను ఓడించి లౌకిక ప్రజాస్వామ్య సామాజిక పోరాట శక్తులను గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి ఎర్ర వెంకటయ్య, సత్యనారాయణ, జయమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, మరియమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు