/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ Miryala Kiran Kumar
మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

ఎన్నికలకోడ్ 

మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

సూర్యాపేట శివారులో వాహన సోదాలు చేసిన పోలీసులు

 సూర్యాపేట 

 

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ని సూర్యాపేట సమీపం లోని విజయవాడ - హైదరబాద్ జాతీయ రహదారి పై చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు.ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి జగదీష్ రెడ్డి పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. కార్ లోని డాష్ బోర్డ్ లను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేసి డబ్బు ఉందా? అంటూ ఆరా తీశారు. తమ వాహనం మొత్తం, వెంట ఉండి మరీ, పోలీసులకు చూపించారు. వాహన తనిఖీ అనంతరం మంత్రికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

నేడు బిఆర్ఎస్ లోకి కాసాని జ్ఞానేశ్వర్

బిఆర్ఎస్ లోకి కాసాని జ్ఞానేశ్వర్

హైదరాబాద్‌: తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్‌ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగు దేశం పోటీ చేయవద్దని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాసాని ఆ పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ ఉండగా.. ఉన్న పార్టీని కాదని మరొక పార్టీని ఎన్నికల్లో గెలిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ముదిరాజ్‌ సామాజిక వర్గంలో పట్టున్న నేతగా కాసాని జ్ఞానేశ్వర్‌కు గుర్తింపు ఉన్నది.

వాట్సాప్‌లో మెసేజ్‌ చేసినా వెళ్లడం లేదా.. కారణమిదేనేమో!

 వాట్సాప్‌లో మెసేజ్‌ చేసినా వెళ్లడం లేదా.. కారణమిదేనేమో!

ఓ సారి చెక్‌ చేసుకోండి..


మీ వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లో ఎవరికైనా మెసేజ్‌ లేదా కాల్స్‌ చేసినప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వారు మీ వాట్సాప్‌ని బ్లాక్‌ చేశారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం వీటి ఆధారంగా బ్లాక్‌ చేశారని నిర్ధారించడం కూడా కష్టమే. ఎందుకంటే వాట్సాప్‌లో కొన్ని ఫీచర్లు వినియోగదారుల ప్రైవసీని కాపాడే క్రమంలో

వాట్సాప్.. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌. ఫేస్‌బుక్ మాతృ సంస్థ అయిన మెటా యాజమాన్యంలో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం సమాచార మార్పిడికి వాట్సాప్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది. విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకూ అందరికీ వాట్సాప్‌ అవసరం కాదు అనివార్యమైపోయింది. అంతలా అందులోని ఫీచర్లు జనాలకు కనెక్ట్‌ అయ్యాయి. అయితే వాట్సాప్‌ అకౌంట్‌ ప్రతి ఒక్కరితోనూ మీరు చాట్‌ చేయొచ్చు. కాకపోతే వారి నంబర్‌ మీ వద్ద ఉండి తీరాలి. అయితే కొంతమంది మీ నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేస్తారు. ఆ విషయం మీకు అర్థంకాకపోతే వాట్సాప్‌ ఏదో సమస్య అని పొరబడుతుంటారు. సాధారణంగా బంధువర్గంలోనో, స్నేహితుల్లోనో కొన్ని సందర్భాల్లో తరచూ మనం చాట్ చేసే వ్యక్తులు మన నంబర్ను బ్లాక్‌ చేస్తే విషయం మొదట అర్థం కాదు. మరి మనల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే దానిని మనం ఎలా గుర్తించాలి? అందుకు ఏమైనా ప్రత్యేకమైన మార్గాలున్నాయా? తెలుసుకుందాం రండి..


ఇలా తెలుసుకోవచ్చు..

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కచ్చితమైన మార్గం లేనప్పటికీ, ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి కొన్ని అంశాలు మనకు సహకరిస్తాయి. అవేంటంటే..

లాస్ట్‌ సీన్‌ కనిపించదు.. మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్‌లో బ్లాక్‌ చేస్తే..వారు చివరిసారిగా వాట్సాప్‌ చూసిన సమయం అదేనండి లాస్ట్‌ సీన్‌ను మీరు చూడలేరు. అది మీకు హైడ్‌ అయిపోతోంది. ఎందుకంటే బ్లాక్‌ చేసిన వ్యక్తి గోప్యతను కాపాడటానికి ఈ సమాచారాన్ని కనిపించకుండా చేస్తుంది.

‘ఎస్బీఐ చాక్లెట్ ప్యాక్’ విధానం గురించి తెలుసా? రుణ గ్రహీతలకు ఇంటికొచ్చి మరీ చాక్లెట్ ఇస్తారు.. పూర్తి వివరాలు ఇవి..

ప్రొఫైల్‌ ఫొటో కనపడదు.. మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తి ప్రొఫైల్‌ ఫొటోలను కూడా మీరు చూడలేరు. కొత్తగా ఏదైనా ప్రొఫైల్‌ ఫొటో మార్చితే అది కూడా మీకు తెలియదు. ఇది కూడా వారి ప్రైవసీ కోసం పెట్టిన ఫీచర్‌.

బ్లూటిక్స్‌ కనపడవు.. మిమ్మల్ని బ్లాక్‌ చేసిన వ్యక్తికి మీరు ఏదైనా మెసేజ్‌ పంపితే వారికి చేరదు. మీరు మెసేజ్‌ పంపినప్పుడు ఒక టిక్‌ మార్క్‌ కనిపిస్తుంది కానీ అవతలి వ్యక్తికి అది చేరదు. అందువల్ల బ్లూ టిక్‌ మార్క్‌ అనేది ఎప్పటికీ రాదు. ఒక చెక్‌ గీత మాత్రమే మీకు కనిపిస్తుంది. మీరు పంపిన మెసేజ్‌ అవతలి వ్యక్తికి చేరకుండా వాట్సాప్‌ బ్లాక్‌ చేస్తుంది.

కాల్స్‌ వెళ్లవు.. మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన వ్యక్తికి వాట్సాప్‌ కాల్‌ చేయలనుకుంటే ఆ కాల్‌ మీకు కనెక్ట్‌కాదు. ఎంత ట్రై చేసిన కాల్‌ వెళ్లదు. ఇదికూడా వాట్సాప్‌ నిరోధిస్తుంది.

మీ వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లో ఎవరికైనా మెసేజ్‌ లేదా కాల్స్‌ చేసినప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వారు మీ వాట్సాప్‌ని బ్లాక్‌ చేశారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం వీటి ఆధారంగా బ్లాక్‌ చేశారని నిర్ధారించడం కూడా కష్టమే. ఎందుకంటే వాట్సాప్‌లో కొన్ని ఫీచర్లు వినియోగదారుల ప్రైవసీని కాపాడే క్రమంలో వీటిని నిర్వహిస్తుంటాయి. ఉదాహరణకు ఎవరైనా వాట్సాప్‌లో తాను చివరిసారిగా చూసిన అంటే లాస్ట్‌ సీన్‌ని డిసేబుల్ చేసి ఉంటే వారి లాస్ట్‌ సీన్‌ మీకు కనిపించదు. లేదా వారి ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్యలు ఉన్నా లాస్ట్‌ సీన్‌ మీకు కనిపించకపోవచ్చు. కాబట్టి పైన పేర్కొన్ని అన్ని సంకేతాలను బట్టి.. క్రాస్‌ చెక్‌ చేసుకొని ‍‍బ్లాక్‌ చేశారని నిర్ధారించుకోవడం ముఖ్యం.

ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా పాటలను రిలీజ్ చేస్తున్న అధికార, విపక్ష పార్టీలు..

ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా పాటలను రిలీజ్ చేస్తున్న అధికార, విపక్ష పార్టీలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుండి మొదలు కానుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వీధుల్లో పార్టీలకు సంబంధించిన పాటల మోత మోగుతోంది. తెలంగాణకు పాటలతో విడదీయలేని బంధం ఉంది.. తొలి దశ ఉద్యమం నుంచి మొదలుకుంటే మలి దశ ఉద్యమం దాకా పాటలతోనే రాష్ట్ర పోరాటానికి ఊపిరి పోసింది

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3 నుండి మొదలు కానుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. వీధుల్లో పార్టీలకు సంబంధించిన పాటల మోత మోగుతోంది. తెలంగాణకు పాటలతో విడదీయలేని బంధం ఉంది.. తొలి దశ ఉద్యమం నుంచి మొదలుకుంటే మలి దశ ఉద్యమం దాకా పాటలతోనే రాష్ట్ర పోరాటానికి ఊపిరి పోసింది పాట.


పాటల ప్రాముఖ్యతను చాటుతూ ఉద్యమ సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలలోకి వెళ్లాయి. ప్రస్తుతం పాట నేడు రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రజలకు దగ్గరవడానికి పాటనే ప్రధాన అస్త్రంగా నమ్ముకున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మేనిఫెస్టో ప్రచారం కోసం అధికార పార్టీ పాటల్లో రిలీజ్ చేస్తూ ఉంటే.. ప్రభుత్వ వైఫల్యాలను అవినీతిని ఎండకడుతూ ప్రతిపక్షాలు కూడా పాటలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి అయిదారు పాటలను విడుదల చేస్తున్నారు. సమస్యలను గురించి ప్రస్తావిస్తూ ప్రజల్లో పాటలతో హోరెత్తిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ జెండాలే రామక్క అని పాటను ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా చేస్తుంది గులాబి పార్టీ. అయితే అభ్యర్థులు అదే పాటను మార్చిన ప్రతిపక్ష పార్టీలు సర్కార్ చేయని పనులు ఇతర ఇతర సమస్యలపై పాటల రూపంలో రిలీజ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసిన గులాబీల జెండాలే రామక్క అనే పాట ఎన్నికల ప్రచారంలో విపరీతంగా దూసుకెళ్లింది.. పార్టీ ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట భాగా వినిపిస్తోంది. పాలమూరు జిల్లా కలల ప్రాజెక్టు అయినటువంటి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు, కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ప్రవేశపెట్టిన పథకాలను పొగుడుతున్నట్లుగా ఈ పాట సాగింది. ఈ పాట విపరీతంగా ప్రజల్లోకి దూసుకెళ్తోంది.


వెంటనే అలెర్ట్ అయిన ప్రతిపక్షాలు ఇదే పాటను ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి కుటుంబ పాలనను ప్రశ్నిస్తూ సెటైరికల్‌గా మరో పాటను రిలీజ్ చేశాయి. ఈ పాట బాగా వైరల్ అయింది. ఈ విధంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల పాటల జోరు ప్రజల్లోకి విపరీతంగా వెళుతున్నాయి. ఈ విధంగా ఒకొక్క అభ్యర్థి మూడు నుండి ఐదు పాటలను తమ నియోజకవర్గాలలో పాటల మార్చుకుని ముందుకెళుతున్నారు.

రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్‌ మహిళల కోసమే

రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్‌ మహిళల కోసమే

ఆధార్‌ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదింవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను...



ప్రముఖ జీవత బీమా సంస్థ ఎల్‌ఐసీ కేవలం జీవిత బీమానే కాకుండా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ అందిస్తున్నాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం కల్పిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళల కోసం ఇలాంటి ఎన్నో పథకాలను ఎల్‌ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలాంటి పథకాల్లో ఒకటి ఆధార్‌ శిలా యోజన పథకం. ఇంతకీ ఏంటీ ఆధార్‌ శిలా యోజన పథకం, దీని బెనిఫిట్స్‌ ఏంటో తెలియాలంటే ఈ స్లోరీలోకి వెళ్లాల్సిందే..

ఆధార్‌ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదింవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను రోజువారీ, నెలవారీ, మూడు నెలలు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాది ఒకసారి నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు.

ఈ పథకం ద్వారా కనీసం రూ. 75,000 నుంచి గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం మినిమం మెచ్యూరిటీ సమయం 10 ఏళ్లుగా ఉంటుంది. గరిష్టంగా 20 ఏళ్ల వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత బోనస్‌తో కలిపి మొత్తం తిరిగి చెల్లిస్తారు. బోనస్‌ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న ఓ మహిళ 20 ఏళ్ల పాటు పెటుబడితే ఎంత ఆదాయం పొందొచ్చే ఇప్పుడు చూద్దాం.


30 ఏళ్ల వయసున్న ఓ మహిళ ఉదాహరణకు రోజుకు సుమారు రూ. 60 పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఇలా 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మొత్తం దాదాపు రూ. 4 లక్షల 20 వేల వరకు పెట్టుబడిగా పెడతారు. ఇలా 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ముగియగానే.. సుమారు రూ. 8 లక్షలు పొందొచ్చు. పెట్టుబడిని ఆన్‌లైన్‌లో, లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌కు ఆఫ్‌లైన్‌ విధానంలో కూడా చెల్లించవచ్చు. మీ బడ్జెట్‌, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడిని ఎంచుకోవచ్చు.

చేరికల హోరు .. బీఆర్‌ఎస్‌ జోరు

చేరికల హోరు .. బీఆర్‌ఎస్‌ జోరు

మున్సిపల్ చైర్మన్ వార్డ్ లో ప్రతి పక్షాలు ఖాలీ 

మంత్రి జగదీష్ రెడ్డి కే మా మద్దతు అంటున్న యువత

సూర్యాపేట పట్టణం లోనీ 9, 21వ వార్డ్ లనుండి భారీగా చేరిక

కాంగ్రెస్, బిజెపి లను వీడి బీఆర్ఎస్ లో చేరిన 400 మంది యువకులు, మహిళలు

గులాబి కండువా తో స్వాగతం పలికిన మంత్రి

మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, అబ్దుల్ రహీమ్ ఆద్వర్యం లో చేరిక

డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయులు కిన్నెర పరమేష్

డాక్టరేట్ అందుకున్న ఉపాధ్యాయులు కిన్నెర పరమేష్

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కిన్నెర పరమేష్  జాతీయస్థాయి యుజిసి - జెఆర్ ఎఫ్ పరీక్షలో అర్హత సాధిoచి చరిత్ర విభాగంలో "తెలంగాణలో కోయ జాతి - సామాజిక ,ఆర్ధిక పరిస్థితులు" అనే అంశం పై ఉస్మానియా విశ్వవిద్యాలయం లో  లో  పిహెచ్ డి పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళసై సౌందర్యరాజన్ ఆద్వర్యం లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పద్మ శ్రీ డా. శాంతన్ నారాయణ్ ఎడోబ్ అమెరికా సిఇవొ, మరియు ప్రో. రవీందర్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డ్ అందుకున్నారు. వీరు గ్రూప్ 1 లో సైతం సెలక్ట్ కావడం తో  పరమేష్ ను 35 వ వార్డులో జిల్లా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు జ్యోతి కరుణాకర్, పిఆర్ టియు జిల్లా కార్యదర్శి లింగయ్య తో పాటు పలువురు ప్రముఖులు అభి‌నందనలు తెలిపారు.

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మున్న మధు యాదవ్

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మున్న మధు యాదవ్ నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా చివ్వెంల మండలం గుంపుల గ్రామానికి చెందిన మున్నా మధు యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మున్న మధు యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మున్నా మధు యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కు తన నియామకానికి సహకరించిన సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కొల్లూరి ఈ దయ బాబు కు కృతజ్ఞతలు తెలియజేశారు

ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు

[11/1, 10:25 PM] miryalakirankumar89: Telangana | ర‌వాణా శాఖ ఉద్యోగుల‌కు ఎన్నిక‌ల విధుల నుంచి మిన‌హాయింపు

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్ర‌భుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే శాఖ కూడా అవడంతో రిలాక్సేషన్ ఇచ్చినట్లు తెలిపారు.

ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?

ఎలక్షన్స్ నామినేషన్ దాఖలుకు ఎంత చెల్లించాలంటే?

TS: నామినేషన్ దాఖలుకు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10వేలు, SC, ST అభ్యర్థులు రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఒక అభ్యర్థి గరిష్ఠంగా 4సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. అఫిడవిట్ను అసంపూర్తిగా నింపి ఇస్తే, దానిని సవరించాలని అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసులిస్తారు. ఒకవేళ అభ్యర్థి నోటీసులకు స్పందించకపోతే నామినేషన్ తిరస్కరించే అధికారం ఆ అధికారికి ఉంటుంది.