/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz చంద్రబాబు వారసుడే రేవంత్ రెడ్డి.. మంత్రి హరీష్ రావు Yadagiri Goud
చంద్రబాబు వారసుడే రేవంత్ రెడ్డి.. మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా :జులై 19

కాలం కాక‌పోయినా.. రెండు పంట‌లు పండే నీళ్లు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని రైతుల‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు భ‌రోసానిచ్చారు. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సిద్దిపేట రూర‌ల్ మండ‌లం లోని రాఘ‌వాపూర్ రైతు వేదిక‌లో ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా బుధవారం నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రి హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక గంట క‌రెంట్‌తో ఒక గుంట భూమి కూడా త‌డ‌వ‌ద‌ని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు తెలివి లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడో దొంగ రాత్రి క‌రెంట్ ఇచ్చేవార‌ని తెలిపారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైతులు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. దొంగ రాత్రి క‌రెంట్ ఇస్తే.. ఆ స‌మ‌యంలో బావుల వ‌ద్ద‌కు వెళ్లి పాము కాట్ల‌కు రైతులు ఎంద‌రో బ‌ల‌య్యారు. క‌రెంట్ షాక్‌ల‌తో కూడా రైతులు చ‌నిపోయార‌ని మంత్రి గుర్తు చేశారు.

ఒక విద్యుత్ క‌నెక్ష‌న్ మీద ప్ర‌భుత్వం రూ. 25 వేలు ఖ‌ర్చు చేస్తుంద‌న్నారు. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏడాదికి రూ. 12 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. రైతుబంధు కింద రూ. 14 వేల కోట్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. గోడౌన్లు ఇంకా మిగ‌తా వాటికి రూ. 6 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

చంద్ర‌బాబు వార‌సుడే రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వ్య‌వ‌సాయం దండ‌గ అని.. ఐటీ కంపెనీలు పెంచండి అని బాబు అన్నారు. క‌రెంట్ బిల్లులు త‌గ్గించ‌మ‌న్న రైతుల‌ను బ‌షీర్‌బాగ్‌లో కాల్చి చంపించాడ‌ని గుర్తు చేశారు. ఈ విష‌యాల‌పై రైతులు చ‌ర్చ చేయాలి. గ‌తంలో మ‌న‌కు క‌రువొచ్చి బ‌త‌క‌డానికి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు మ‌న వ‌ద్ద‌కు బ‌తికేందుకు వ‌స్తున్నారు. కాంగ్రెస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాల‌ని రైతులను కోరుతున్నాన‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు........

'వందేమాతరం' నినాదాన్ని నా మతం అనుమతించదు SP ఎమ్మెల్యే అబూ అజ్మీ

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ వందేమాతరం చెప్పడానికి నిరాకరించడంతో ఈరోజు మహారాష్ట్ర శాసనసభలో గందరగోళం చెలరేగింది.వందేమాతరం గురించి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.కొద్దీ తర్వాత సభ వాయిదా పడింది.

సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అజ్మీ.. ఎవరి ముందు తలవంచేందుకు తన మతం అనుమతించదని ప్రకటన ఇచ్చారు. అందుకే వందేమాతరం అని చెప్పలేం. మా అమ్మ ముందు మనం కూడా తల వంచుకోము. మేము అల్లా ముందు మాత్రమే తల వంచుకుంటాము. అఫ్తాబ్ పూనావాలా పేరుతో ముస్లింల పరువు తీశారని అజ్మీ అన్నారు.

నా హృదయంలో నా దేశం పట్ల గౌరవం తగ్గదు - అజ్మీ

ఇది కాకుండా, అబూ అజ్మీ మాట్లాడుతూ, 'ఈ దేశం కోసం వారి పూర్వీకులు తమ ప్రాణాలను అర్పించిన వారిమే, మేము భారతదేశాన్ని తమ దేశంగా భావించాము మరియు పాకిస్తాన్ కాదు. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించిన వాని ముందు తలవంచాలని ఇస్లాం బోధిస్తుంది.

నా మతం ప్రకారం, నేను వందేమాతరం మాట్లాడలేకపోతే, అది నా దేశం పట్ల నాకున్న గౌరవాన్ని మరియు నా హృదయంలో నా దేశభక్తిని తగ్గించదు మరియు అది ఎవరికీ ఎటువంటి అభ్యంతరం కలిగించకూడదు, మీరు ఈ దేశానికి చెందిన వారైతే, మేము కూడా !

ఒక మతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు

అఫ్తాబ్ పూనావాలా పేరుతో ముస్లింల పరువు తీశారని అజ్మీ అన్నారు. దీని తర్వాత, అజ్మీ, ఔరంగాబాద్‌లోని రామాలయం వెలుపల జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, మీరు భారతదేశంలో జీవించాలనుకుంటే వందేమాతరం అంటే ఏమిటని అక్కడ నినాదం చేశారు. దీంతో వాతావరణం అస్తవ్యస్తం కావడంతో పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి తరలించారు. మళ్లీ రాత్రికి పదిహేను ఇరవై మంది అక్కడికి వచ్చారు. దీంతో ఇరువర్గాల వారు అక్కడికి రావడంతో నినాదాలు, వాగ్వాదం మొదలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం ఇరువైపులా 250-250 మంది ఉన్నారని అజ్మీ తెలిపారు. అందుకే ఒకే మతానికి చెందిన వారిని ఎందుకు అరెస్టు చేశారన్నది నా ప్రశ్న.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే లేదు?

బీసీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బరితెగించి మాట్లాడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవటానికి బీసీ నేతలు సిద్దమవుతున్నామన్నారు.

బీసీ నేతలను అవమానించే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొంటామన్నారు. బీసీలకు జరుగుతోన్న అవమానంపై కాంగ్రెస్‌లో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని కోరారు.

ఇందిరా, రాజీవ్‌గాంధీ, సోనియాదగాంధీలను తిట్టినవారు కాంగ్రెస్‌ కు నాయకత్వం వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ప్రతి బీసీ కులాన్ని కించపరిచేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీసీ నాయకత్వాన్ని బలహీనపరిచే కుట్ర కాంగ్రెస్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు..

సచ్చేది లేదంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా బీఆర్ఎస్‌లో ఉన్న బీసీ నేతల‌ను కాంగ్రెస్ టార్గెట్ చేసిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు....

మోడీ ఫాసిస్టు విధానాలపై ఉద్యమించడమే కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డికి నివాళి

మోడీ ఫాసిస్టు విధానాలపై ఉద్యమించడమే కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డికి నివాళి

-- CPI (M-L) న్యూడెమోక్రసీ

గోడవరిలోయ ప్రతిఘటనోద్యమ నాయకుడు,అజ్ఞాత దళ కమాండర్,సరసనపల్లిలో బూటకపు ఎన్ కౌంటర్లో అమరుడైన కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి 23వ వర్ధంతి సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని శ్రామిక భవన్ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్,ఇఫ్టూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బొంగరాల నర్సింహ, బొమ్మిడి నగేష్ లు మాట్లాడుతూ పీడిత,తాడిత అణగారిన వర్గాలకోసం కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాట వెలుగులో కృష్ణారెడ్డి ఉద్యమిచాడని అన్నారు.గ్రామంలో పెత్తందార్లు,భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించాడని అన్నారు.తీవ్ర నిర్బందాలను ఎదుర్కొని అశేష ప్రజల విముక్తికోసం కామ్రేడ్ కృష్ణారెడ్డి పోరుబాట పట్టాడని అన్నారు.

ఖమ్మం,వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు,గిరిజనులకు,దళిత,బహునులకు ఆత్మబందువుగా విజయ్ అన్నగా పరిచయమై అజ్ఞాత దళ నాయకుడుగా పొడు భూముల రక్షణకై ఉద్యమించాడని కొనియాడారు.

కామ్రేడ్ విజయన్న ను నరహంతక చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరం జూలై 19 సరసనపల్లి అడవులను చుట్టుమట్టి కామ్రేడ్ పజ్జూరి కృష్ణారెడ్డి (విజయ్)తోపాటు భరత్,రాజులను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసిందని అన్నారు.వారి ఆశయాల సాధనకోసం బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాలని అన్నారు.

మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అనుసరిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రావుల వీరేశ్,జానపాటి శంకర్,కత్తుల చంద్రశేఖర్, దాసరి నర్సింహ, మామిడాల ప్రవీణ్, చింతల వెంకటరమణ, యం.డి సర్వాన్,జెర్రిపోతుల రాము తదితరులు పాల్గొన్నారు.

Bengaluru: బెంగళూరులో పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరు(Bengaluru)లో ఉగ్రదాడులకు జరుగుతోన్న కుట్రలను సెంట్రల్ క్రైమ్‌ బ్రాంచ్‌(Central Crime Branch (CCB) భగ్నం చేసింది..

ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. అలాగే వారి దగ్గర ఉన్న పేలుడు పదార్థాలు, ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రకుట్రకు సంబంధించి మరో ఐదుగురు అనుమానితుల కోసం లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు..

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని సీసీబీ(CCB)కి సమాచారం అందింది. ఈ క్రమంలో అరెస్టులు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుతం సీసీబీ అదుపులో ఉన్న వ్యక్తులకు 2017లో జరిగిన ఓ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ కేసులో బెంగళూరులోని సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో వారికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, పేలుడు పదార్థాల వాడకంలో శిక్షణ పొందారని తెలిపాయి..

PUBG Love: సీమా హైదర్‌కు పాక్‌ సైన్యంతో సంబంధాలు!

దిల్లీ: పబ్జీ ఆడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) యువకుడు సచిన్‌ మీనాను ప్రేమించి వీసా లేకుండా నలుగురు పిల్లలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్ కేసులో మరికొన్ని విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి..

ఆమెకు పాకిస్థాన్‌ సైన్యంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీమా భర్త గులామ్‌ హైదర్‌ ఓ భారతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సీమా హైదర్‌ సోదరుడు ఆసిఫ్‌ పాకిస్థాన్‌ సైన్యంలో చేరాడని, ఆమె బంధువు పాక్‌ సైన్యంలో ఉన్నతస్థాయి అధికారిగా ఉన్నట్లు తెలిపాడు.

సీమా సోదరుడు కరాచీలో పనిచేస్తున్న సమయంలో అతణ్ని కలుసుకున్నట్లు గులామ్‌ తెలిపాడు. అయితే, అతడు ప్రస్తుతం పాక్‌ సైన్యంలో పనిచేస్తున్నాడా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పాడు. అలాగే, ఆమె బంధువు ఇస్లామాబాద్‌లోని పాక్‌ సైనిక కార్యాలయంలో పనిచేస్తున్నట్లు గులామ్‌ తెలిపాడు..

గత రెండు రోజులుగా సీమా హైదర్‌తోపాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన సచిన్ మీనా, అతడి తండ్రిని యూపీ ఏటీఎస్‌ అధికారులతోపాటు, ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.

ఆమెకు ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమా పేరిట ఉన్న పాకిస్థాన్‌ గుర్తింపు కార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటితోపాటు ఆమె పాస్‌పోర్ట్‌, ఇతర ధ్రువపత్రాలు, పిల్లల వివరాలకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు..

సమ్మె వీడి, విధుల్లో చేరండి..కార్మికులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి

సిద్ధిపేట జిల్లా :జులై 19

వ‌ర్షాలు కురుస్తున్న‌ నేపథ్యంలో సీజనల్ వ్యాధుల వ్యాపిస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది.

సీజనల్ వ్యాధులు ప్రబలే దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని బుధవారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల విషయాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే వెయ్యి రూపాయల వేతనాన్ని పెంచారని మంత్రి హ‌రీశ్ గుర్తు చేశారు. ఇప్పటికీ ఆయన దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయన్నారు.

సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని హరీశ్ రావు భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చలు జరిపి తప్పకుండా వీలైనంత త్వరితగతిన సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

పారిశుద్ధ్య కార్మికులంతా సమ్మెను విరమించి అందరూ పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల కంటే మన తెలంగాణ రాష్ట్రంలోనే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వాలలో 500, 1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశ్యంతో అడగకుండానే 8,500 రూపాయలకు పెంచారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే 8, 500 నుంచి 9, 500కు పెంచిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు.........

మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువు నష్టం కేసులో రాజశేఖర్ జీవిత దంపతులకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్ట్

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ మీడియా సాక్షిగా ఆరోపణలు చేశారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై రాజశేఖర్ దంపతులు మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొంటూ చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 2011లో కేసు దాఖలు చేసిన కేసులో తీర్పు వెలువడింది.

ఈ మేరకు నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ సాయి సుధ మంగళవారం సంచలన తీర్పు ఇచ్చారు. ఈ పరువు నష్టం కేసులో దంపతులకు జైలుశిక్ష ఖరారైంది. జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

SB NEWS

సీమా హైదర్‌కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు

భారత యువకుడు సచిన్‌ను ప్రేమించి సరిహద్దులు దాటి పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన సీమా హైదర్.. మూడు దేశాల సరిహద్దులు దాటి మే 13న అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన సీమా హైదర్.. గ్రేటర్‌కు రాకముందే.. నోయిడా, పాకిస్థాన్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి నేపాల్ వచ్చింది. ఆ తర్వాత నేపాల్ నుంచి భారత సరిహద్దుల్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఆ తర్వాత ఆమె గ్రేటర్ నోయిడాలోని రబుపురా పట్టణంలో నివసించడం ప్రారంభించింది. సరిహద్దులో పాక్ ఏజెంట్ అంటూ నిత్యం ఆరోపణలు వస్తున్నాయి.

పాకిస్తాన్ ఆర్మీలో సీమా హైదర్ సోదరుడు మరియు మామ

పాకిస్థానీ మహిళ సీమా హైదర్ UP పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు UP ATS లకు ఒక చిక్కుముడిలా కొనసాగుతోంది. సీమా హైదర్‌కి సంబంధించి రోజుకో షాకింగ్ సీక్రెట్‌లు బయటపడుతున్నాయి.. సీమా హైదర్ సోదరుడు, మామ పాకిస్థాన్ ఆర్మీలో ఉన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అతని పేరు ఆసిఫ్ మరియు ప్రస్తుతం ఆసిఫ్ ఉద్యోగం మానేశాడు, మరోవైపు, గులాం హైదర్ కూడా సీమ మామ గులాం అక్బర్ ఇస్లామాబాద్‌లో ఉన్నాడని మరియు సైన్యంలో ఉన్నత పదవిలో ఉన్నాడని చెప్పాడు. అయితే, ATS యొక్క విచారణలో, సీమా హైదర్ కూడా తన ప్రకటన నుండి తప్పించుకుంటోందని చెప్పబడింది. పాకిస్థాన్ ఆర్మీలో సోదరుడు ఉన్నాడనే ప్రశ్నపై మౌనం దాల్చింది.

ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపబడింది

ఇక్కడ, UP ATS సీమా హైదర్ యొక్క అన్ని సోషల్ మీడియా ఖాతాలను స్కాన్ చేస్తోంది. మూలాల ప్రకారం, సీమా హైదర్ సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తులు. వీరిలో కొందరికి భారత సైన్యంతో సంబంధం ఉన్న విషయం తెరపైకి వచ్చింది. దీనిపై కూడా విచారణ జరుపుతున్నారు.వీరు సైన్యంతో సంబంధం కలిగి ఉన్నారా లేక ఇప్పుడే ఆర్మీ ప్రొఫైల్ పిక్చర్ పెట్టారా అనే కోణంలో కూడా తనిఖీలు చేస్తున్నారు.

భారతదేశంలోకి ప్రవేశించిన దావాను ధృవీకరించడం సాధ్యం కాదు

సీమా హైదర్ కేసును విచారిస్తున్న కేంద్ర ఏజెన్సీల ప్రకారం, మే 13న, ఇండో-నేపాల్ సరిహద్దు సునౌలీ సెక్టార్ మరియు సీతామర్హి సెక్టార్‌లో మూడవ దేశ పౌరుల ఉనికి గురించి ఎటువంటి సమాచారం తెరపైకి రాలేదు. భారతదేశం-నేపాల్ సరిహద్దులోని ఈ రెండు ప్రదేశాల నుండి సీమా హైదర్ మరియు సచిన్ భారతదేశంలోకి ప్రవేశం పొందుతున్నారు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రికార్డులు మరియు CCTV ఫుటేజీని పరిశీలించారు మరియు ప్రస్తుతం వారు ఇచ్చిన సమాచారం ధృవీకరించబడలేదు. . విచారణ సందర్భంగా సచిన్, సీమా ఇచ్చిన సమాచారం మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు మే 13న 1850 కిలోమీటర్ల మేర ఉన్న ఇండో-నేపాల్ సరిహద్దులోని అన్ని బస్సు మార్గాల్లో ప్రయాణిస్తున్న బస్సుల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాయి.

సచిన్ కంటే ముందే చాలా మంది భారతీయులతో పరిచయం ఉంది

సీమా హైదర్‌ని విచారిస్తున్నప్పుడు, షాకింగ్ విషయాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సమాచారం ప్రకారం, ఆమె పబ్-జి ద్వారా పరిచయమైన మొదటి భారతీయ యువకుడు సచిన్ కాదు. అంతకు ముందు కూడా సీమా హైదర్ భారతదేశంలోని చాలా మంది యువకులను సంప్రదించారు. ఆలోచింపజేసే విషయమేమిటంటే ఆ యువకులంతా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందినవారే.

పబ్‌జి ఆడుతూ ప్రేమలో పడింది

పాకిస్థాన్‌లోని కరాచీ నివాసి సీమా హైదర్, రబూపురా నివాసి సచిన్‌తో పబ్‌జి ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తన ప్రేమను పొందడానికి, సీమా హైదర్ అక్రమంగా భారతదేశ సరిహద్దులోకి ప్రవేశించి మే 13న రబుపురాలో నివసించడం ప్రారంభించింది. జులై 6న సమాచారం అందుకున్న పోలీసులు సీమా, సచిన్‌లను అరెస్టు చేశారు. సీమ నెలన్నర రోజులుగా అక్రమంగా రబూపురలో మకాం వేసి స్థానిక ఏజెన్సీకి కూడా ఆచూకీ లభించలేదు.

26 మంది డిప్యూటీ కమిషనర్లు బదిలీ

గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీగా బదిలీలు చేపట్టారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ, పోస్టింగ్ ఇస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవలే జిహెచ్ఎంసికి కొత్త కమిషనర్ గా రోనాల్డ్ రోస్ వచ్చారు. ఆయన పలు అంశాలపై రివ్యూ నిర్వహించి జిహెచ్ఎంసిలో డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు పలువురికి స్థానచలనం కలగగా, మరికొంతమందికి ఇటీవల మున్సిపల్ కమిషనర్ల నుంచి రిలీవైన వారికి పోస్టింగ్లను ఇచ్చారు.

బదిలీలు జరిగిన అధికారుల వివరాలు

కాప్రా డిప్యూటీ కమిషనర్ ఎన్.శంకర్ బేగంపేట్ సర్కిల్ డీసీగా బదిలీ

బేగంపేట్ డీసీ ముకుంద్ రెడ్డి చందానగర్ డీసీగా బదిలీ

ఉప్పల్ డీసీ అరుణ కుమారి చరణ్ సరూర్ నగర్ డీసీగా బదిలీ

సరూర్ నగర్ డీసీ కృష్ణయ్య కూకట్ పల్లి డిప్యూటీ కమిషనర్ గా బదిలీ

హయత్ నగర్ డీసీ మారుతి దివాకర్ అంబర్ పేట్ డీసీగా బదిలీ

అంబర్ పేట్ డీసీ వేణుగోపాల్ ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం

చార్మినార్ డీసీ సూర్యకుమార్ అల్వాల్ డీసీగా బదిలీ

అల్వాల్ డీసీ నాగమణిని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం

రాజేంద్రనగర్ డీసీ జగన్ మెహిదిపట్నం డీసీగా బదిలీ

మెహిది పట్నం డీసీ Md అలీని తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కు అటాచ్ చేస్తూ ఆదేశం

కార్వాన్ డీసీ శ్రీనివాస్ కు ఉప్పల్ సర్కిల్ -2 డీసీ తో పాటు కాప్రా డీసీగా అదనపు బాధ్యతలు

జూబ్లీహిల్స్ డీసీ రజినికాంత్ రెడ్డి శేరిలింగంపల్లి డీసీ గా బదిలీ

యూసఫ్ గూడ డీసీ రమేష్ మూసాపేట్ డీసీగా బదిలీ

మూసాపేట్ డీసీ రవికుమార్ రాజేంద్రనగర్ డీసీగా బదిల

చందానగర్ డీసీ సుధాంశ్ సికింద్రాబాద్ డీసీగా బదిలీ

సికింద్రాబాద్ డీసీ దశరథ్ ఎల్ బీ నగర్ డీసీగా బదిలీఆర్ సీ పురంఅండ్‌పటాన్ చెరు డీసీ బాలయ్య గోషామహల్ డీసీగా బదిలీ

గోషామహల్ డీసీ డాకు నాయక్ చార్మినార్ డీసీగా బదిలీ

కూకట్ పల్లి డీసీ రవీంద్ర కుమార్ హయత్ నగర్ డీసీగా బదిలీ

గాజులరామారం డీసీ ప్రశాంతి జూబ్లీహిల్స్ డీసీగా బదిలీ

శేరిలింగంపల్లి జాయింట్ కమిషనర్ మల్లయ్య గాజుల రామారం డీసీగా బదిలీ

ఆర్ సీ పురం అండ్‌ పటాన్ చెరు డీసీగా పోచారం మున్సిపాలిటీ కమిషనర్ పని చేసిన సురేష్ కు పోస్టింగ్

సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన చంద్రశేఖర్ కు యూసఫ్ గూడ డీసీగా పోస్టింగ్

నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ గా రిలీవ్ అయిన సత్యబాబుకు కుత్బుల్లాపూర్ డీసీగా పోస్టింగ్

కుత్బుల్లాపూర్ డీసీ మంగతాయారు ను తదుపరి ఆదేశాల వరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అటాచ్ చేస్తూ ఆదేశం..........