/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు : మంత్రి హరీశ్‌రావు Yadagiri Goud
లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులు : మంత్రి హరీశ్‌రావు

ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో డిజిటల్‌ కార్డులు అందిచబోతున్నది. ఆరోగ్యశ్రీ సేవల పరిమితిని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచిన నేపథ్యంలో కొత్తగా కార్డులను జారీ చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో మంగళవారం మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ డిజిటల్‌ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు.

ఇందుకు లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిమ్స్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ రోగులకు బయోమెట్రిక్‌ విధానంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి అనుమతి ఇచ్చారు.

సమావేశంలో హెల్త్‌ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాస్‌ రావు, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌ కుమార్‌, నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

బోర్డు మరికొన్ని నిర్ణయాలు..

మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని బోర్డు నిర్ణయించింది. మరింత నాణ్యంగా డయాలసిస్‌ సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ జరిపేలా ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ రూపొందించి, వినియోగించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 3 డయాలసిస్‌ కేంద్రాలు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం వాటి సంఖ్యను 103కు పెంచింది. ఫలితంగా డయాలసిస్‌ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గ కేంద్రంలోనే డయాలసిస్‌ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ బాధితులకు ఇవి వరంగా మారాయి.

కరోనా సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్‌ ఫంగస్‌ సర్జరీలు విజయవంతంగా నిర్వహించి, ప్రజల ప్రాణాలు కాపాడిన కోఠి ఈఎన్టీ దవాఖానకు రూ.1.30 కోట్ల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.

మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగుచేసే ‘కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు’ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ దవాఖానలో ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇకపై ఈ తరహా సేవలను వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో కూడా అందుబాటులోకి తేవాలని కమిటీ నిర్ణయించింది...

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదారి పరవళ్ళు* l

భ‌ద్రాచలం జిల్లా :జులై 18

గువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. సోమవారం వరకు 13 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది.

గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వరదనీరు వచ్చి తాలిపేరు ప్రాజెక్టులో చేరుతున్నాయి.

ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 9,000 క్యూసెక్కుల వరద నీటిని దిగునున్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరులశాఖ అధికారులు తెలుపుతున్నారు. రేపటికి గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారుల అంచనా.

నిలిచిన బొగ్గు ఉత్ప‌త్తి

వర్షం కారణంగా భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు తీసే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోగా.. సింగరేణి అధికారులు నీటిని మోటర్ల సహాయంతో ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తున్నారు. మొత్తం భూపాలపల్లి వ్యాప్తంగా 503.8 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు....

ప్రతిపక్షాల కూటమి పేరు I-N-D-I-A..?

•ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ పేరుతో ఎన్నికల్లోకి!

న్యూఢిల్లీః 2024 లోక్ సభ ఎన్నికల్లో అధికార బిజెపిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించేందుకు, వ్యూహాలు రచించేందుకు బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో విపక్షాలు రెండో రోజైన మంగళవారం సమావేశమయ్యాయి..

ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ సహా ఆయా పార్టీలు పదకొండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. విపక్ష పార్టీల ఐక్య కూటమికి పేరు కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీల ఫ్రంట్‌కు I-N-D-I-A అనే పేరును ప్రతిపాదించగా, అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ (I-N-D-I-A- భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్ఠి కూటమి) అనే పేరు దాదాపు ఖాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఫ్రంట్ నేతలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

నిన్న జరిగిన విందు సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫ్రంట్‌కు పేరు సూచించాలని సూచించారు. ఈ రోజు ఆ పేర్లను పరిశీలించి, చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా I-N-D-I-A పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది..

ఈ రోజు సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీకి చెందిన శరద్ పవార్, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శరద్ పవార్ నిన్నటి భేటీకి హాజరు కాలేదు. కానీ ఈ రోజు మాత్రం హాజరయ్యారు..

సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి

రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి జ‌న్మ‌దినం నేడు. 58 వ‌సంతాలు పూర్తి చేసుకుని 59వ ఒడిలోకి అడుగిడారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి జగ‌దీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు.

అలాగే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వేరు వేరుగా మంత్రి జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు...

SB NEWS

SB NEWS

Kadapa: తక్కువ ధరకు కిలో టమాటా.. 2 కి.మీ మేర ప్రజల క్యూ

కడప (చిన్నచౌక్‌): టమాటా ధరలు చుక్కలనంటుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయితీ ధరకు టమాటాను దక్కించుకునేందుకు కడపలో ప్రజలు బారులు తీరారు.

స్థానిక రైతు బజారు వద్ద కిలో రూ.50కే విక్రయిస్తుండటంతో ఉదయం నుంచే క్యూలైన్‌లో నిల్చొని టమాటాలు కొనుగోలు చేశారు..

ఉదయం 5 గంటల నుంచే వినియోగదారులు సుమారు 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలు పూర్తయినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.120 నుంచి 150 వరకు ఉండటంతో రైతు బజారులో కొనుగోలుకు ప్రజలు పోటీ పడ్డారు..

ఏలూరులో ఆశ వర్కర్ల ధర్నా

ఏలూరు :జులై 18

ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించకూడదని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ... ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆశావర్కర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. ఆశావర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు....

SB NEWS

SB NEWS

SB NEWS

Nitish Kumar: ప్రతిపక్షాల భేటీ.. నీతీశ్‌ కుమార్‌ను విమర్శిస్తూ పోస్టర్లు..

బెంగళూరు: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమి లక్ష్యంగా విపక్షాలు ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి విడత భేటీ నిర్వహించాయి..

రెండో విడతలో భాగంగా బెంగళూరులో మరోసారి సమావేశమయ్యాయి. అయితే, విపక్షాల రెండో రోజు భేటీ సందర్భంగా బెంగళూరులో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరులోని చాళుక్య సర్కిల్‌ సహా అన్ని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు వెలిశాయి. ప్రతిపక్షాల భేటీ జరుగుతున్న ప్రాంతానికి కొద్ది దూరంలో వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం..

ఒక పోస్టర్‌లో బిహార్‌లో సుల్తాన్‌గంజ్‌ వంతెన కూలిపోవడాన్ని గుర్తుచేస్తూ ఎద్దేవా చేశారు. ' బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌కు స్వాగతం. సుల్తాన్‌గంజ్‌ వంతెన నీతీశ్‌ కుమార్‌ బిహార్‌కు ఇచ్చిన బహుమతి. అది ఎప్పుడూ కూలిపోతూనే ఉంటుంది. నీతీశ్‌ పాలనను బిహార్‌లో వంతెనలు తట్టులేకపోతున్నాయి. అలాంటి వ్యక్తిపై ప్రతిపక్షాలు ఐక్యత కోసం ఆధారపడుతున్నాయి' అని ఒక పోస్టర్‌లో రాశారు. మరో పోస్టర్‌లో 'నిలకడలేని ప్రధానమంత్రి పోటీదారు. బెంగళూరులో బిహార్‌ సీఎంకు రెడ్‌కార్పెట్‌ స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. సుల్తాన్‌గంజ్‌ బ్రిడ్జ్‌ మొదటిసారి కూలింది ఏప్రిల్ 2022, రెండోసారి కూలింది జూన్ 2023' అంటూ విమర్శించారు..

ఈ పోస్టర్ల గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. కార్పొరేషన్‌ సిబ్బంది సహాయంతో వాటిని తొలగించారు. విపక్షాల భేటీలో భాగంగా రెండో రోజు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతిపక్ష కూటమి నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, కన్వీనర్‌గా బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది..

పుట్టిన రోజున మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు.. బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తన సతీమణి సునితతో కలసి మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్, రామచంద్ర నాయక్, అనిల్ కుర్మాచలం, రాజీవ్ సాగర్, పల్లె రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు మంత్రి జగదీశ్‌ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రితో కేక్‌ కట్‌ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.......

తడిసి ముద్దయిన హైదరాబాద్

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రాత్రి నుండి భారీగా వర్షం కురుస్తూనే ఉంది మంగళవారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది, బుధవారం కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

గురు, శుక్రవారాల్లోనూ భారీగా కొనసాగనున్నాయని తెలిపింది. బుధవారంలోగా బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా.

మరోవైపు ఝార్ఖండ్‌ దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీవర్షాలు కురిసే సూచనలున్నాయి...

SB NEWS

గాలి అనిల్ వైపే అధిష్టానం చూపు?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నది. ఇందుకు దీటుగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది.

ఇందులో భాగంగానే ఏ నియోజకవర్గంలో అధికార పార్టీకి దీటుగా కాంగ్రెస్ నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. సీనియర్లు, జూనియర్లు అని కాకుండా గెలుపే లక్ష్యంగా ఎవరికి టిక్కెట్ ఇస్తే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుపై కాంగ్రెస్ అధిస్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జి గాలి అనిల్ కుమార్‌ను బరిలో దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికార పార్టీని ఢీకొట్టాలంటే ఆర్థిక, స్థానిక బలం ఉండాలని ఈ నేపథ్యంలోనే అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వేగంగా మారుతున్న పరిణామాలతో పటాన్ చెరు కాంగ్రెస్ రాజకీయంగా రసవత్తరంగా మారుతున్నది...