Telangananews

Nov 23 2021, 14:37

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత 

 


నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన జాబితాలో చివరి గంటల్లో ఇద్దరు అభ్యర్థులు మారిపోయారు. నిజామా బాద్ జిల్లా నుంచి తొలుత ఆకులు లలితను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి.

 

కానీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆకస్మికంగా ఆమె స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సైతం గాయకుడు సాయిచంద్ పేరును ఖరారు చేసినట్లుగా ఆదివారం వార్తలు వచ్చినప్పటికీ మరుసటి రోజు (సోమవారం)కు ఆయన స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కూచికుళ్ల దామోదర్ రెడ్డి పేరు వచ్చి చేరింది.

ఆయనకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఫాం అందజే శారు. వీరిద్దరూ మంగళవారం మధ్యాహ్నం ఆయా జిల్లా కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. మిగిలిన పది మంది పేర్లు యథావిధిగా ఉన్నాయి. 

Telangananews

Nov 23 2021, 13:51

వింటర్ బెస్ట్ బ్రేక్‏పాస్ట్స్... 

 


శీతకాలంలో మన రోజూవారీ అలవాట్లు మారుతుంటాయి. ఈ సీజన్లో ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. కానీ.. ప్రతిసారీ ఆహారం చల్లగా ఉండడం వలన చిన్నపిల్లలతోపాటు.. పెద్దవారు కూడా ఆహారం పై అయిష్టత చూపిస్తుంటారు. చలికాలంలో శరీరంలో మార్పులు జరుగుతుంటాయి. అందుకు మీరు తీసుకునే ఆహారంలో కూడా మార్పులు ఉండాలి. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పలు ఉండాలి. ముఖ్యంగా అల్పాహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉదయం చలి ఎక్కువగా ఉండడం వలన చాలా మంది బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. అలా కాకుండా.. ఈ సీజన్‏లో శరీరాన్ని వెచ్చగా ఉంచే అల్పాహారాన్ని తీసుకోవాలి. అవేంటంటే..

 

▪ ఓట్స్ పాలక్ పరోటా.. ఓట్స్.. బచ్చలి కూర పరోటా చలికాలంలో మంచి బ్రేక్ ఫాస్ట్. ముఖ్యంగా ఇది షుగర్ పేషెంట్స్ కు మేలు చేస్తుంది.

▪ రాగి కి ఖీర్.. రాగి ఖీర్ రుచి చాలా బాగుంటుంది.దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా చాలా పోషకమైనది కూడా. చలికాలంలో ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

▪ అందే కి భుర్జీ పరాఠా – నాన్ వెజ్ తిననివారు గుడ్డు భుర్జీ పరాఠాను అల్పాహారంలో తినవచ్చు. ఇది ఎనర్జీ బూస్టర్‌గా ఉండటమే కాకుండా ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అల్పాహారానికి ఇది సరైన ఆహార పదార్థం.

 

▪ ముల్లంగి కా రైతా – చలికాలంలో హెవీ బ్రేక్‌ఫాస్ట్. సాధారణంగా ఉదయాన్నే తీసుకోవడం మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. ఇందులో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

▪యాపిల్ స్మూతీ – రోజూ యాపిల్ ఫ్రూట్ తినాలని వైద్యులు చెబుతుంటారు. ఇది అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. నేరుగా యాపిల్ తినని వారు స్మూతీగా మార్చి తీసుకోవచ్చు. ఇది శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది.

▪ నమ్‌కీన్ దాలియా – దాలియా తక్కువ కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటుంది. చలికాలంలో ఇది బెస్ట్ ఫుడ్. నమ్కీన్ గంజి జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది అలాగే బరువు పెరగకుండా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. 

Telangananews

Nov 23 2021, 13:31

HIV మిరాకిల్.. ఎయిడ్స్‌ను జయించిన 30 ఏళ్ల మహిళ! 

 


2013లో ఎయిడ్స్‌ నిర్దారణ అయిన అర్జెంటీనా మహిళలో తాజాగా హెచ్‌ఐవీ లక్షణాలు అదృశ్యం కావడం పరిశోధకులను విస్మయానికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీతో శాశ్వతంగా పోరాడుతున్న వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు కావచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పెరాన్జా నగరానికి చెందిన నిర్ధారణ అయిన మహిళ (30) వైద్య పరంగా ‘ఎలైట్ కంట్రోలర్’ లక్షణాలను కలిగి ఉంది. చికిత్స కోసం శక్తివంతమైన ఔషధాలను తీసుకోవడం ఆపివేసిన తర్వాత కూడా ఆమెలో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌‌లో ప్రచురించిన అధ్యయనంలో తెలిపారు.

 

 ‘విస్తృతమైన పరీక్షలో ఎక్కడా ప్రొవైరస్‌గా పిలిచే హెచ్ఐవీ ఆమె DNAలో కలిసినట్లు బయటపడలేదు.. దీనిని వైద్య పరిభాషలో ‘స్టెరిలైజింగ్ క్యూర్’అంటారు.. అంటే ఆమె ఇకపై వైరస్ ప్రతిరూపం దీర్ఘకాలికంగా ఆమెలో ఉండదు’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఇది ఎలా జరిగిందనేది మిస్టరీగా ఉందని పేర్కొన్నారు. గతంలో బ్లడ్ క్యాన్సర్‌కు కణజాల మార్పిడి చికిత్స తీసుకున్న ఇద్దరు HIV రోగులు ఎయిడ్స్‌ను జయించారు. ఈ ఇద్దరిలోనూ విస్తృతమైన కేన్సర్ చికిత్స తర్వాత హెచ్‌ఐవీ నెగెటివ్ వచ్చింది. ప్రస్తుత కేసులో ఆమె వైరస్‌ను ఎలా జయించారనే అంశంపై పరిశోధకులు స్పష్టమైన సమాధనం ఇవ్వనప్పటికీ అది సాధ్యమేనని సూచిస్తున్నారు.

 ‘రక్తం, కణజాలాల నుంచి భారీ సంఖ్యలో కణాలను విశ్లేషించినప్పటికీ, ఎలైట్ కంట్రోలర్‌లో వైరస్ ఆనవాళ్లు లేవు.. ఈ రోగి సహజంగానే HIV-1 ఇన్ఫెక్షన్‌ స్టెరిలైజింగ్ క్యూర్’ సూచిస్తున్నాయి’ అని బోస్టన్ రాగన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన జు యు నేతృత్వంలోని పరిశోధకులు తెలిపారు. బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్ రెట్రోవైరస్ అండ్ ఎయిడ్స్‌కు చెందిన నటాలియా లూఫర్‌తో కలిసి ఈ పరిశోధనలు సాగించారు. ‘HIV-1 స్టెరిలైజింగ్ క్యూర్ చాలా అరుదైన కానీ సాధ్యమేనని ఈ పరిశీలన నిరూపించింది’ ఎయిడ్స్ రోగులలో వైరస్‌ను నిర్మూలించేందుకు వైద్యులు దశాబ్దాలుగా విఫలయత్నం చేస్తున్నారు. కాంబినేషన్ డ్రగ్ థెరపీ ద్వారా వైరస్‌ను నిర్మూలించడానికి ప్రయత్నాలు చేసినా.. చికిత్స ఆపివేసిన తర్వాత మళ్లీ హెచ్ఐవీ తిరగబెడుతోంది. తాజా కేసులో వైరస్ లక్షణాలు పూర్తిగా నయం కావడంతో భవిష్యత్తులో ఎయిడ్స్ నిర్మూలనకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ‘ఆమె ప్రారంభ రోగనిరోధక ప్రతిస్పందన అబార్టివ్ ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అవకాశం ఉంది లేదా రోగనిరోధక వ్యవస్థ కాలక్రమేణా వైరస్‌ను గుర్తించి నాశనం చేయడంలో మెరుగ్గా మారింది.. హెచ్‌ఐవీ అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అని మెల్‌బోర్న్ యూనివర్సిటీ పీటర్ డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ కో-ఆథర్ షారన్ లెవిన్ అన్నారు. ‘ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ఎందుకంటే ఇది నివారణకు మరొక మార్గం’ అని లెవిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా, 2017 జులైలో ఎయిడ్స్‌తో మరణించిన ‘బెర్లిన్ రోగి తిమోతీ బ్రౌన్’ని పోలి ఉంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తిమోతీ బ్రౌన్ దాదాపు 15 సంవత్సరాల కిందట లుకేమియాకు కణజాల చికిత్సను చేయించుకున్న తర్వాత అతడిలో HIV నెగెటివ్ వచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ 8 కోట్ల మందికిపైగా ఎయిడ్స్ బారినపడగా.. 3.63 కోట్ల మంది చనిపోయారు. 2020 నాటికి 37.7 కోట్ల మంది బాధితులున్నారు. గతేడాదిలో ఏకంగా 1.5 మిలియన్ల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. 

Telangananews

Nov 23 2021, 13:18

బల్గేరియాలో ఘోర బస్సు ప్రమాదం... - 45 మంది మృతి 

 


బల్గేరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్‌ ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 45 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రమాద బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. కాలిన గాయాలతో ఉన్న ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు.

 

ప్రమాదానికి గురైన బస్సు టర్కీ నుంచి ఇస్తాంబుల్ మీదుగా నార్త్ మెసినోనియన్ ప్రాంతాలోని స్కోప్జ్ ప్రాంతానికి వెళ్తుంది. బస్సులో 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు బస్తు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్‌ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంతో జరిగిందని అన్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. 

Telangananews

Nov 22 2021, 17:34

కమల్ హాసన్ కు కరోనా పాసిటివ్ 

 

 

 


నటుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. రీసెంట్ గా యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా కాస్త కరోనా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన హాస్పిటల్ లో ఐసొలేషన్ లో ఉన్నారు. కమల్ హాసన్ తన ఆరోగ్యం పట్ల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగానే, ఆయన త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను అభిమానులంతా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు’ సీక్వెల్ ‘ఇండియన్ 2’, ‘ఖైది’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో ‘విక్రమ్’ సినిమాలు చేస్తున్నారు. 

Telangananews

Nov 22 2021, 17:18

లాక్​డౌన్​ రూల్స్ వద్దంటూ నిరసనలు 

 


వీధుల్లోకి వచ్చి జనం నిరసనలు
19 మందిని అరెస్ట్​ చేసిన పోలీసులు
ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీలోనూ ఆందోళనలు
ఆమ్​స్టర్​డ్యామ్: యూరోపియన్​దేశాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండటంపై డబ్ల్యూహెచ్​వో ఆందోళన వ్యక్తంచేస్తోంది. కాగా వైరస్​ను కట్టడి చేసేందుకు ఆయా దేశాలు లాక్​డౌన్​ విధించడంతోపాటు కఠిన ఆంక్షలు పెడుతుండగా.. పౌరులు వాటిని ఒప్పుకోవడంలేదు. లాక్​డౌన్​ రూల్స్, కరోనా ఆంక్షలను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నెదర్లాండ్స్​లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ దేశ ప్రభుత్వం 3 వారాల పాక్షిక లాక్​డౌన్ ​విధిస్తూ గత వారం ఆంక్షలు పెట్టింది. లాక్​డౌన్​ రూల్స్​ను వ్యతిరేకిస్తూ జనం పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేస్తున్నారు. నెదర్లాండ్స్‌‌‌‌లోని అనేక పట్టణాలు, నగరాల్లో శనివారం వరుసగా రెండో రోజు అల్లర్లు చెలరేగాయి. రోటర్‌‌‌‌డామ్‌‌‌‌ సిటీలో నిరసనలు హింసాత్మకంగా మారాయి.పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. హేగ్‌‌‌‌లో ప్రజలు పోలీసులపై టపాసులు పేల్చి, వాహనాలకు నిప్పంటించారు. నిరసనకారులు విసిరిన రాయి పేషెంట్​ను తీసుకెళ్తున్న అంబులెన్స్ కిటికీకి తాకింది. అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. అధికారులు నగరంలో కర్ఫ్యూ విధించారు. హింసకు పాల్పడిన19 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. సెంట్రల్ ‘బైబిల్ బెల్ట్’ పట్టణం ఉర్క్, దక్షిణ లిమ్‌‌‌‌బర్గ్ ప్రావిన్స్‌‌‌‌లోని నగరాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. మ్యాచ్​ను చూసేందుకు ఆంక్షలు పెట్టడంపై కోపంగా ఉన్న అభిమానులు రెండు ఫుట్‌‌‌‌బాల్ మ్యాచ్‌‌‌‌లకు అంతరాయం కలిగించారని డచ్ మీడియా తెలిపింది. శుక్రవారం రాత్రి కూడా రోటర్‌‌‌‌డామ్‌‌‌‌లో 51 మంది అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

 

మిగతా దేశాల్లోనూ..
ఆస్ట్రియా, క్రొయేషియా, ఇటలీ, బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్​​లోనూ ఇవే తరహా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ లాక్​డౌన్ ​కొనసాగుతోంది. అత్యవసర షాప్​లు మినహా అన్ని దుకాణాలు మూసివేశారు. జర్మనీతో పాటు క్రొయేషియాలో కరోనా టీకా తప్పనిసరి చేయడంపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటలీలో ‘గ్రీన్ పాస్’ సర్టిఫికెట్లను వ్యతిరేకిస్తూ నిరసనకారులు రోమ్‌‌‌‌లో ఆందోళన చేపట్టారు. కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌‌‌‌లో ఆందోళనలను కట్టడి చేసేందుకు అధికారులు పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఫ్రాన్స్​లోనూ నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాత్రిపూట అల్లర్ల చెలరేగాయి. ఆందోళనకారులు షాప్​లకు నిప్పు అంటించారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా యూకే, జర్మనీ మధ్య ట్రావెల్​ ​రూల్స్ ​సడలించే ఆలోచనలేదని యూకే హెల్త్​ సెక్రెటరీ సాజిద్​ జావిద్ ​తెలిపారు. యూరప్​అంతటా కఠిన ఆంక్షలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగొచ్చని ప్రాంతీయ హెల్త్​ డైరెక్టర్​ హన్స్​ క్లూగే చెప్పారు. 

Telangananews

Nov 22 2021, 17:14

రాష్ట్రపతి చేతుల మీదుగా వీర్ చక్ర అందుకున్న అభినందన్ 

 

 
యుద్ధంలో వీరోచితంగా పోరాడి.. శత్రుదేశాలకు పట్టుబడినా.. ఏ మాత్రం బెదరకుండా దైర్యసాహసాలను ప్రదర్శించిన గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‎కు వీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్‎లో వీర్ చక్ర, శౌర్య పురస్కాల ప్రదానోత్సవం జరిగింది. ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన జవాన్ల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‎నాథ్ కోవింద్ పతకాలు అందజేశారు. వైమానిక దళ గ్రూప్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‎కు వీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. బాలాకోట్ వైమానిక దాడుల్లో పాల్గొన్న అభినందన్.. పాకిస్తాన్‎కు చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశాడు. యుద్ధ సమయాల్లో సాహసాలు ప్రదర్శించిన సైనికులకు భారత ప్రభుత్వం అత్యున్నత వీర్ చక్రతో సన్మానిస్తోంది. 

ప్రస్తుతం భారత సైన్యంలో సేవలందిస్తున్న అభినందన్ వర్ధమాన్.. బాలాకోట్ వైమానిక దాడుల్లో పాక్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. 2018 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ హోదాలో పాకిస్థాన్‎కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‎ను కూల్చేశారు. శత్రుదేశాలకు పట్టుబడిన సమయంలోనూ ఆయన అసాధారణ దైర్యసాహసాలు ప్రదర్శించారు.

అదేవిధంగా.. వివిధ ఆపరేషన్లలో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, 200 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న మేజర్ విభూతి శంకర్‎కు శౌర్య చక్ర ప్రదానం చేశారు. ఈ అవార్డును ఆయన భార్య లెఫ్టినెంట్ నితికా కౌల్ అందుకున్నారు. జమ్మూకాశ్మీర్‎లో జరిగిన ఓ ఆపరేషన్‎లో పలువురు ఉగ్రవాదులను అంతమొందించి.. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‎కు చెందిన సాపర్ ప్రకాశ్ జాదవ్‎కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన సతీమణి, తల్లి ఈ అవార్డును అందుకున్నారు. 

Telangananews

Nov 22 2021, 17:09

కిరాయి కట్టలేదని MPDO ఆఫీసుకు తాళం 

 

 
 కరీంనగర్ 

అద్దె చెల్లించడం లేదని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశాడు ఆ భవన యాజమాని. మండలాల విభజనలో భాగంగా కరీంనగర్ జిల్లాలో గన్నేరువరం మండలం నూతనంగా ఏర్పడింది. ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతో మండల ఎంపీడీవో కార్యాలయం కోసం నెలకు రూ. 12,500 అద్దె చొప్పున జూలై 2019లో ఓ బిల్డింగ్‎ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి 11 నెలలు కిరాయి చెల్లించిన ప్రభుత్వం.. గత 18 నెలల కిరాయి చెల్లించలేదు. దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశాడు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే.. అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బిల్డింగ్ యాజమాని తిరుపతి వాపోతున్నాడు. అద్దె రూపంలో తనకు ఇంకా రెండు లక్షల ఇరవై ఐదు వేల కిరాయి రావాలని తిరుపతి తెలిపాడు. అవి ఇచ్చేంతవరకు ఎంపీడీవో కార్యాలయానికి తాళం తీసేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. 

Telangananews

Nov 22 2021, 17:03

అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి 

 

 
అమెరికాలోని ఎల్లికాట్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం తెరాటి గూడెం కు చెందిన 28 ఏళ్ల మండలి శేఖర్.. గత రెండేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. శేఖర్ మరణవార్తను అమెరికా అధికారులు.. అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు. తమ కుమారుడి మృతదేహం అమెరికాలో ఉందని, భారత్ కు తీసుకువచ్చేందుకు సాయపడాలని అతడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Telangananews

Nov 22 2021, 16:52

ఎమ్మెల్సీలుగా ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవం 

 

 
ఎమ్మెల్యేగా కోటా ఎమ్మెల్సీలుగా.. ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ ( మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీ లేకపోవటంతో గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, వెంకట్రామిరెడ్డి, బండ ప్రకాష్, పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.