TSNews

Jun 11 2021, 15:11

రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసు.. ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు.. 
 

 
 
టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జరుపుతోంది. దాదాపు రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాండ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు.
మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకున్నారు నామా. పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

రాంకీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాల‌పై త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎంపీ ఆస్తులపై ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ సోదాలు హాట్ టాపిక్ అయ్యాయి. 

TSNews

Jun 11 2021, 15:01

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు...  
 

 భారతదేశంలో పసిగట్టలేకపోతున్న సంస్థలు 
 
  భారతదేశంలో, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో కరోనా చికిత్సకు సంబంధించిన అనేక పోస్టులు తప్పుదోవ పట్టించేవిధంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ సంస్థలకు హిందీ, కొన్ని ప్రాంతీయ భాషలలో వస్తున్న కంటెంట్ తనిఖీ చేసే దృఢమైన వ్యవస్థ లేకపోవడం వలన ఇలా జరుగుతోందని బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ఏప్రిల్, మే మధ్య, ఇటువంటి 150 పోస్టులు హిందీలో వెలుగుచూశాయి. ఇందులో కరోనా గురించిన స్వదేశీ చికిత్స పద్ధతులు వివరించారు. ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 150 పోస్టులను 10 కోట్లకు పైగా ప్రజలు అనుసరిస్తున్నారు. వీటిపై నిఘా పరిస్థితి గురించి గమనిస్తే.. జూన్ వరకు, ఈ 150 పోస్టుల్లో 10 పోస్టులు తొలగించడం జరిగింది లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు లేబుల్ చేయడం జరిగింది. ఇక ఒక వారంలో ట్విట్టర్‌లో 60 కి పైగా క్లెయిమ్‌లు వచ్చాయి, వీటిని 3.5 మిలియన్ల మంది అనుసరించారు.

 

ఫాక్ట్ చెక్ సైట్ ఆల్ట్ న్యూస్ కు చెందిన ప్రతీక్ సిన్హా ప్రకారం, తప్పుడు సమాచారంతో పోరాడటానికి ఫేస్‌బుక్, ఇతర సంస్థలకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం. కానీ లాభం కారణంగా ఇది జరగలేదు. భారతదేశం, యుఎస్లలో ప్రకటనల ధరలలో తేడా ఉంది. ఇక్కడ ఎక్కువ డబ్బు లేదు. కాబట్టి సంస్థ సిబ్బందిపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదు. అదేవిధంగా పోస్టులు ఫిల్టర్ చేయడం జరగటం లేదు.

ఇక అదేవిధంగా యూట్యూబ్‌లో చికిత్సా పద్ధతుల వ్యాప్తి చాలా ఉంది. ఒక వీడియోలో, స్వామి ఇంద్రదేవ్జీ మహారాజ్ ఆవిరిని పీల్చడం ద్వారా కరోనా ఎటువంటి పరిస్థితిలోనూ రాదని పేర్కొన్నారు. కుటుంబం మొత్తం ఆవిరి తీసుకుంటే, ముసుగు, శానిటైజర్ అవసరం లేకుండా శరీరాన్ని అది లోపలి నుండి శుభ్రపరుస్తుంది అని చెప్పడం కనిపిస్తుంది. అయితే, డబ్ల్యూహెచ్‌ఓ ఏడాది క్రితమే దీని గురించి చెప్పింది. ఈ వాదన పూర్తిగా తప్పు అని తేల్చింది. అదేవిధంగా ఈవిధానం చాలా అధ్యయనాలలో కూడా ప్రమాదకరమైనదిగా పేర్కొన్నారు.

బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నివేదిక ప్రకారం, కరోనా కిరోన్‌తో కిరోన్‌తో చికిత్స చేస్తానని రామ్‌దేవ్ పేర్కొన్నారు. సరిగ్గా ఊపిరి పీల్చుకోలేని వారి కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన వీడియోను మిలియన్ల మంది ప్రజలు చూశారు. ఫేస్‌బుక్‌లో రామ్‌దేవ్ ఉండటం మల్టి మిలియన్ డాలర్ల ప్రశ్న అని ఆక్స్ఫర్డ్ రీసెర్చ్ ఫెలో సుమిత్రా బద్రీనాథన్ అన్నారు. అందుకే ఫేస్‌బుక్ వారి తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కూడా తొలగించడం లేదు. 

TSNews

Jun 11 2021, 14:45

పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లకు వ్య‌తిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేత‌ల ఆందోళ‌న‌లు 
 


రాష్టంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకీ పెరిగిపోతోన్న నేప‌థ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లకు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పెట్రోల్ బంకుల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలుపుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. ఒక‌వైపు క‌రోనా ప్ర‌జల జీవితాల‌తో ఆడుకుంటుంటే మ‌రోవైపు కేంద్ర ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను పెంచేస్తూ మ‌రింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంద‌ని చెప్పారు. ఘ‌ట్‌కేస‌ర్‌లో ఎంపీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నిర‌స‌న తెలుపుతోంది. హైద‌రాబాద్‌-వ‌రంగ‌ల్ ర‌హ‌దారి ప‌క్క‌న ఉన్న పెట్రోలు బంకు వ‌ద్ద ప్లకార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

హైద‌రాబాద్‌లో ఉత్త‌మ్ కుమార్ కుమార్ రెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య, అంజ‌న్ కుమార్, దాసోజు శ్ర‌వ‌ణ్ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. జ‌గిత్యాల‌లో ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి నేతృత్వంలో ఆందోళ‌న‌లు తెలుపుతున్నారు. జీవ‌న్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

TSNews

Jun 11 2021, 14:37

కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్యా రాంబాబు మరియు వైస్ చైర్మన్ గా వజ్జ రాజు నియామకం 
 


ఎమ్మెల్యే వనమా సూచన మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీలను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
తన చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసిన : ఎమ్మెల్యే వనమా

 భద్రాది కొత్తగూడెం జిల్లా 
 కొత్తగూడెందుర్గా ప్రసాద్ 

ఈరోజు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే వనమా సూచనమేరకు కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూక్యా రాంబాబు ను, వైస్ చైర్మన్ గా వజ్జా రాజును మరియు కమిటీ సభ్యులు ను నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులకు తన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రాంబాబుకు, వైస్ చైర్మన్ వజ రాజుకు మరియు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి, కెసిఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని, నియోజకవర్గం లోని రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, రైతులకు సేవ చేయడం ఒక యజ్ఞంలా స్వీకరించాలని, రైతుల విషయంలో అలసత్వం వహించోదని అన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాను పూల మాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి న నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భుక్యా రాంబాబు, వైస్ చైర్మన్ వజ్జ రాజు మరియు కమిటీ సభ్యులు. 

TSNews

Jun 11 2021, 14:32

రెండో డోస్ తీసుకున్న తర్వాత ఓ వ్యక్తిలో అయస్కాంత శక్తి! 
 

 

          

కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత తన శరీరంలో అయస్కాంత శక్తి ఉత్పన్నమయ్యిందని, ఇనుము ఉక్కు పదార్థాలు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత ఇలా జరిగిందంటూ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన అరవింద్ జగన్నాథ్ సోనార్ షేర్ చేసిన వీడియోలో అతడికి స్ఫూన్‌లు, చిన్న ప్లేట్స్ అతుక్కుపోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరవింద్ జగన్నాథ్ సోనార్ కొద్ది రోజుల కిందట సెకండ్ డోస్ తీసుకున్నాడు. అప్పటి నుంచే ఈ వింత శక్తి కనిపిస్తోందని జగన్నాథ్ ఆరోపిస్తున్నాడు. తొలుత చెమట కారణంగా ఇనుప వస్తువుల శరీరానికి అతుకుతున్నాయని జగన్నాథ్ సహా కుటుంబ సభ్యులు భావించారు. కానీ, స్నానం చేస్తున్న సమయంలోనూ ఇనుప వస్తువులు తన శరీరానికి అంటుకోవడం చూసి షాక్ అయ్యాడు. ఈ వింత కేసుపై వైద్యులు స్పందించారు. ఆయన శరీరానికి ఇనుప వస్తువులు అంటుకోడానికి, వ్యాక్సిన్‌కు ఎటువంటి సంబంధం లేదని వైద్యాధికారులు పేర్కొన్నారు. దీనిపై పరిశోధన అవసరమని, ఈ అంశంలో ఉన్నతాధికారులు అభిప్రాయం తీసుకోవాల్సి ఉందన్నారు. అరవింద్ సోనార్ వద్దకు ఆరోగ్య సిబ్బంది బృందాన్ని పంపినట్టు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాపూసాహెబ్ నాగర్‌గోజే అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సాధారణంగా ఉందని ధ్రువీకరించారు. అయితే, టీకాకు, ఈ అయస్కాంత శక్తికి ఎటువంటి సంబంధం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, తాను యూట్యూబ్‌లో ఒక వీడియోను చూశానని, అందులో రెండో డోస్ తీసుకున్న తర్వాత తన శరీరంలో అయస్కాంత శక్తి తలెత్తిందని ఢిల్లీకి చెందిన వ్యక్తి చెబుతున్నారని ఉటంకించారు. ‘ఒకసారి తాము కూడా ప్రయత్నిద్దామని చూసి నాణెలు, స్ఫూన్స్, ప్లేట్స్ వంటి ఇనుప వస్తువులను నాన్న శరీరానికి దగ్గరగా తీసుకెళ్లాం. దాంతో అవి నాన్న శరీరానికి అతుక్కుపోయాయి. అది చూసి అంతా షాక్ అయ్యాం.’ అని జగన్నాథ్ తనయుడు చెప్పుకొచ్చాడు. మహారాష్ట్రలో కరోనా టీకా తీసుకోవడంపై ఇప్పటికే అపోహలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఈ కథనాలు ప్రచారంలోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. 

TSNews

Jun 11 2021, 12:23

వ్యాక్సిన్ వేసుకున్నాక శరీరంలో ఏం జరుగుతుందంటే..? 
 


కరోనా వ్యాక్సన్ వేసుకున్నాక మనిషి శరీరంలో దాని ప్రభావం ఎంత మేరకు ఉందనేది తెలుసుకునేందుకు అధ్యయనాలు జరుగుతున్నాయి. శరీరం రోగ నిరోధక వ్యవస్థ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి సహజసిద్ధంగా స్పందించేది.. రెండోది మందులు, టీకాలు తదితర వాటి ఉత్ప్రేరకంతో పనిచేసేవి. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నాక తెల్ల రక్త కణాలు వ్యాక్సిన్ తో కలసిపోయి ప్రక్రియను చేపడతాయి. దీని వల్ల వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఒళ్ల నొప్పులు, జ్వరం.. అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ ప్రక్రియ వయసును బట్టి క్షీణిస్తుంది. యువత చాలా దృఢంగా ఉంటారు కాబట్టి ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది. అలాగే వృద్ధుల్లో యువతకు భిన్నంగా నిదానంగా పనిచేస్తుంది కాబట్టి వీరికి లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వీరికే వ్యాక్సిన్ ఉత్తేజం అవసరం అవుతుంది. యాంటీ బాడీలను ఉత్పత్తి చేసేందుకే వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
మహిళలు వ్యాక్సిన్ వేసుకున్నాక గడ్డలు కట్టిందని చెబుతుంటారు. అవి క్యాన్సర్ గడ్డలేమోనని అనుమానిస్తుంటారు. ఇలాంటి అనుమానాలు తలెత్తకూడదంటే మహిలలు రొమ్ము క్యాన్సర్ నిర్దారణకు మామో గ్రామ్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం జ్వరం.. తలనొప్పి.. ఒళ్ల నొప్పులు రావడం సాధారణమే అని.. శరీర దృఢత్వాన్ని బట్టి ఇవి రెండు మూడ్రోజులు లేదా 15 రోజుల వరకు ఉండే ఛాన్స్ ఉందని తేలింది. ఇంతకు మించి ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి జబ్బులను నిర్ధారించుకుని తగిన చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అపోహలకు దూరంగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే ఇమ్యూనిటీ స్థాయి తెలిసిపోతుందని.. తక్కువగా ఉంటే వెంటనే పెంచుకోవాల్సిన అవసరం సూచిస్తుందని చెబుతున్నారు. 

TSNews

Jun 11 2021, 12:13

జమ్ము కశ్మీర్ లో భారీ అగ్నిప్రమాదం... 
 

 15కు పైగా ఇళ్లు దగ్ధం... 
 

జమ్ము కశ్మీర్ లో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బారాముల్లా జిల్లా కేంద్రానికి సమీపంలోని నూర్ బాగ్ లో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15కు పైగా ఇళ్లు కాలిపోయాయి. గ్యాస్ లీకేజీతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంటలు అంటుకున్న తర్వాత.. వేడికి పక్క ఇళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందన్నారు. 

TSNews

Jun 11 2021, 12:03

తెలంగాణలో ప్రారంభమైన షర్మిల పర్యటన... 
 

 నేడు రంగారెడ్డి జిల్లాలో... 

తెలంగాణ రాజకీయ పార్టీ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. వైఎస్ఆర్‌టీపీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించుకునే ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఈసీ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికే జిల్లాల పర్యటనలను షర్మిల ప్రారంభించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో ఆమె పర్యటిస్తున్నారు. పరిగి నియోజకవర్గం దోమ మండలంలో ఐకేపీ సెంటర్‌ను షర్మిల పరిశీలించనున్నారు. ఇటీవలే ఇక్కడ రైతులు తమ పంటను కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపై ధాన్యాన్ని తగ్గులబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలోని కుటుంబాలను కలిశారు. శేరిల్ల గ్రామంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి వెంకటేశ్ యాదవ్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. బీఈడీ చదివి టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడకపోవడంతో వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణలో పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భావానికి నెల రోజులు ఉన్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని బావిస్తున్నట్లు అర్థం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అడహక్ కేంద్రాల ఏర్పాటు పూర్తికావచ్చింది. ఈ మేరకు మరిన్ని పర్యటనలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీపై అందరిలో ఆసక్తి నెలకుంది. 

TSNews

Jun 11 2021, 11:52

దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్... 
 

Date : 11-06-2021
 
దేశంలో కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 3403 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొత్తగా 91,702 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలావుంటే, గత 24 గంటల్లో 1,34,580 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య
2,92,74,823కు చేరింది. మరో
3,403 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,63,079కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,77,90,073 మంది కోలుకున్నారు. 11,21,671 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24,60,85,649 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,42,42,384 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,44,131 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, తెలంగాణలో గురువారం నాటి లెక్కల ప్రకారం 1,30,430 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,798 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 174, ఖమ్మం జిల్లాలో 165, నల్గొండ జిల్లాలో 151 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 2,524 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు.

తెలంగాణలో ఇప్పటిదాకా 5,98,611 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,71,610 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 23,561 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,440కి చేరింది. అటు, రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు మరింత పెరిగి 95.48 శాతానికి చేరింది. 

TSNews

Jun 11 2021, 10:46

ఈ రోజు రాశి ఫలాలు... 
 

Date : 11, జూన్ , 2021

 
 మేషం

 

శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు.
 ఇష్టదైవం ధ్యానం శుభప్రదం. 

 వృషభం 

కుటుంబం సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు.
 గోసేవ చేయాలి.

మిధునం
తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. 
శివుడిని ఆరాధిస్తే మంచిది.

 కర్కాటకం 
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.
 శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

 సింహం
అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. 
ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

 కన్య
సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.
 ఆంజనేయస్వామిని ఆరాధించాలి.

 తుల
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.
 ఈశ్వర దర్శనం శుభప్రదం.

 వృశ్చికం
 సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంత వాతావరణం కలదు. 
ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

 ధనుస్సు
 చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు . ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్దిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. 
శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.

మకరం
మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. 
లక్ష్మీగణపతి ధ్యానం మంచిది.

 కుంభం
 ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్య