VijayaKumar

5 hours ago

విద్యార్థుల మృతిపై న్యాయం జరిపించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ కి వినతి పత్రం అందజేసిన పల్ల గొర్ల మోదీ రాందేవ్

 భువనగిరి ప్రభుత్వ ఎస్సీ గురుకులా హాస్టల్లో మృతిచెందిన ఘటనలపై విచారణ జరిపించాలని SC ముఖ్య కార్యదర్శి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ ను సెక్రటేరియట్లో కలిసి వినతిపత్రం ఇచ్చిన SC,ST,BC హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ భువనగిరి ఎస్సీ హాస్టల్లో కలుషిత ఆహారం తిని మృతి చెందిన ప్రశాంత్ అలాగే రెండు నెలల క్రితం ఎస్సీ హాస్టల్లో చనిపోయిన భవ్య, వైష్ణవి, 1 ఇయర్ క్రితం చనిపోయిన మనోహర్ ఇలా యాదాద్రి జిల్లాలో మూడు సంవత్సరాల వ్యవధిలో 9 మంది విద్యార్థుల మరణాలపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా sc సంక్షేమ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విద్యార్థుల ప్రాణాలంటే ఈ అధికారులకు దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది జరిగిన ఘటనలకు బాధ్యులైన అందరిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసేయాలని విద్యార్థుల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు మృతి చెందిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని జిల్లా మరియూ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో tssA అధ్యక్షులు కూరెళ్ళ మహేష్, MRPS నాయకులు చిట్టిపాక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

10 hours ago

కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండల జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరో 400 మంది కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. దీంతో మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

.

VijayaKumar

Apr 18 2024, 16:07

గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలి ఏఐఎస్ఎఫ్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ ను గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది 

ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టల్లో గురుకులాలు సందర్శించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

ఈనెల 14వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి చిత్రపటానికి సంఘ నాయకులు విద్యార్థులు కలిసి శ్రద్ధాంజలి ఘటించారు 

విద్యార్థి మృతికి కారణమైన సాంఘిక సంక్షేమ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ రజిని గారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేశారు ఇక మీదట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరారు 

సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు 

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది 

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు మచ్చ వినయ్, రామ్ పాక చందు, శివ, సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:16

భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్

అహ్మదాబాద్‌: అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్‌. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్ (Somanath) మరోసారి స్పందించారు..

భవిష్యత్తుల్లోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు (Lunar Missions) చేపడతామని చెప్పారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ''చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం.

ఇక, జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంతవరకు చంద్రయాన్‌ సిరీస్‌లను కొనసాగించాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికతలపై పట్టు సాధించాలి. అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలి. తదుపరి మిషన్‌లో దీన్ని ప్రయత్నిస్తాం'' అని వెల్లడించారు..

భారత్‌ త్వరలో చేపట్టబోయే గగన్‌యాన్‌ గురించి సోమనాథ్‌ మాట్లాడారు. ''దీనికంటే ముందు ఈ ఏడాది ఓ మానవరహిత మిషన్‌ను చేపట్టనున్నాం. ఏప్రిల్‌ 24న ఎయిర్‌డ్రాప్‌ వ్యవస్థను పరీక్షించనున్నాం. ఆ తర్వాత వచ్చే ఏడాది మరో రెండు మానవరహిత యాత్రలను చేపట్టబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే 2025 చివరికి గగన్‌యాన్‌ ప్రయోగం చేపడతాం'' అని పేర్కొన్నారు..

గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రయోగంతో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్‌3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్ర జలాల్లో ల్యాండ్‌ అవుతుంది..

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:00

మహానగరంలో పలుచోట్ల వర్షం

భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరా బాద్ వాసులకు బుధవారం రాత్రి ఉపశమనం కలిగింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపో యింది.

హైదరాబాద్ లోని పలుచోట్ల బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తరువాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, అమీర్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

కుత్బుల్లాపూర్ లోని సూరా రం, చింతల్, నిజాంపేట్, సుచిత్ర, దుండిగల్, షాపూర్ నగర్ పలు ప్రాంతాలలో ఉరుములు తో కూడిన వర్షం కురిసింది.గత కొన్ని రోజులుగా భానుడి భగ భగల నుంచి ఇబ్బంది పడుతున్న నగర వాసులకు వర్షం కురవడంతో ఉపశమనం లభించింది.

దీంతో నగరంలో ఉష్ణోగ్ర తలు భారీగా పడిపోయా యి. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు...

Venkatesh1

Apr 18 2024, 06:59

వైఎస్సార్ సీపీ గెలుపు చారిత్రక అవసరం.. ఆశీర్వదించండి. మీకు మంచి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ..

వైఎస్సార్ సీపీ గెలుపు చారిత్రక అవసరం.. ఆశీర్వదించండి. మీకు మంచి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ

సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ అన్నారు.

శింగనమల మండలం ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, లింగాల రమేష్ లతో కలసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చేపట్టారు.

ముందుగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కొనసాగలంటే ప్రతి ఒక్కరూ "ఫ్యాన్" గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు. 

వారు మాట్లాడుతూ..జగనన్న ఐదేళ్ల పాలనలోనే అద్భుతాలు చేశారని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రధానమంత్రి ప్రశంసలే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్న, మరింత అభివృద్ధి జరగాలన్న జగనన్నకు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చిన దాఖలు లేవని, అయితే జగనన్న 99% హామీలను నెరవేర్చి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసిన రానున్న ఎన్నికలలో జగనన్నను ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. టిడిపి చెబుతున్న హామీలను ప్రజలు నమ్మకపోవడంతో ఓటమి భయంతో దాడికి పాల్పడుతున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 17 2024, 20:22

వలిగొండ ఎస్బిఐ బ్యాంకులో నగదులో కొరత, పరారీలో క్యాషియర్ కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

VijayaKumar

Apr 17 2024, 20:02

గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి; కొడారి వెంకటేష్ ,పల్లగొర్ల మోది రాందేవ్

 భువనగిరి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి చినలచ్చి ప్రశాంత్ కుటుంబానికి ఇరవై లక్షల ఎక్సగ్రేషియా ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని బాలల హక్కుల సంఘం జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీ రాందేవ్ లు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థి సీ ఎచ్ ప్రశాంత్(12) చిత్రపటానికి పూలమాలలు వేసి, క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికి కారణమైన ప్రిన్సిపాల్ ను ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కంచనపల్లి నర్సింగ్ రావు బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్, బి ఆర్ ఎస్ పట్టణ సహాయ కార్యదర్శి గుండెబోయిన సురేష్ ,బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండేబోయిన శంకర్, నాయకులు పోలేపాక సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 17 2024, 11:33

NLG: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవ్వాల ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ల హాజరు పట్టిక,ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషేంట్ల వివరాలను పరిశీలించారు.

హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా..లిఫ్ట్ రిపేర్ అయ్యిందని..రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని..బాలింతలు,పసిపాపలు ఉండే హాస్పిటల్ లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే పేషేంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషేంట్లు,వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.భవన నిర్మాణం నెలరోజుల్లోనే పూర్తిచేసేలా యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.తాను రెండు రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు.భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగిన మంత్రి..రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.

పలుచోట్ల పారిశుద్య నిర్వాహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:16

నేడు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో ఆయన పాల్గొనను న్నారు.

బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించ నున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేప థ్యంలోనే ఆయన బుధవా రం రేవంత్ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేర తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బుధవారం అలిప్పీ నియోజ కవర్గంలో గురువారం వయ నాడు, నియోజకవర్గంలో సిఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. అలిప్పీ నియోజకవర్గం నుంచి ఏఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తుండగా వయనాడు నియోజకవర్గం నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెండు రోజుల పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించను న్నారు.

ఎపి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సిఎం ప్రచారం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినా యకత్వం సిఎం రేవంత్‌ను ఆదేశించింది.

ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళ నాడు, కర్ణాటక, మహారా ష్ట్రల్లో, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పార్టీ అభ్య ర్థులకు మద్ధతుగా రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించను న్నారు.

అధిష్ఠానం నిర్ణయం మేరకు మంగళవారం మహారాష్ట్ర లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సిఎం రేవంత్ పర్యటన రద్దైంది... 18వ తేదీ రాత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరా బాదు చేరుకుంటారు.