నిజందాగదుక్షణంఆగదు

Sep 01 2023, 17:48

చంద్రయాన్‌ స్ఫూర్తితో సూర్యయాన్‌:కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)

చంద్రయాన్‌ స్ఫూర్తితో సూర్యయాన్‌

చంద్రయాన్‌-3 విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ అద్భుతమే సూర్యయాన్‌ మిషన్‌. ఈ మిషన్‌లో భాగంగా సౌరవాయు ఆవర్తనాన్ని సుదూరం నుంచి పరిశీలించడానికి, సూర్యుని వెలుపల ఉన్న పొరలు, సౌరశక్తి కణాలు, వేర్వేరు తరంగ పౌనఃపున్యాల వద్ద ఫోటోస్పియర్‌ (కాంతి మండలం), క్రోమోస్ఫియర్‌ (వర్ణ మండలం)ను ఆధ్యయనం చేయనున్నారు.

కరోనా వలయంలో పెరుగుతున్న వేడి వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని, పిఎస్‌ఎల్‌ వి-సి 57 వాహననౌక ద్వారా సెప్టెంబర్‌ 2న శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి పంపబోతున్నారు. గ్రహణాలు వంటివి పరిశోధనలకు అడ్డంకిగా మారకుండా భూమికి సుమారుగా 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్య్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. భూమి నుండి ఈ కేంద్రానికి చేరుకోవడానికి ఉపగ్రహ వాహక నౌకకి సుమారుగా 175 రోజులు పడుతుంది. ఈ ఉపగ్రహం బరువు 1500కిలో గ్రాములు. ఇది ఏడు పేలోడ్‌లను మోసుకెళ్తుంది. ఆ పేలోడ్లులలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనా గ్రాఫ్‌, సోలార్‌ అల్ట్రా వైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్పరిమెంట్‌, ప్లాస్మా ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌ లోఎనర్జీ ఎక్స్‌ రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌ వన్‌ ఆర్బిటింగ్‌ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్‌, మ్యాగటోమీటర్లు ఉన్నాయి.

వీటిలో విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరొనాగ్రాఫ్‌ ప్రధానమైనది. ఇది సూర్యగోళం నుండి ప్రసరించే కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే ఈ మిషన్‌కు అవసరమైన పరికరాలను బెంగళూరులోని యుఆర్‌ రావు శాటిలైట్‌ కేంద్రం నుండి షార్‌ కేంద్రానికి తీసుకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ సజావుగా జరిగితే అక్టోబర్‌లోనే గగనయాన్‌ ప్రయోగానికి శ్రీకారం చుడతారు.

ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షానికి మహిళా రోబో వ్యోమమిత్రను మొదటగా పంపి, 2024 ఆఖరి నాటికి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షానికి పంపే ఆలోచన చేస్తున్నారు. 2023 మనదేశ అంతరిక్ష చరిత్రలో గుర్తుండి పోయే సంవత్సరం. రెండు నెలల వ్యవధిలోనే చంద్రయాన్‌ విజయం, సూర్యయాన్‌ ప్రయోగం చేపడుతున్న ఇస్రోకు అభినందనలు.

నిజంనిప్పులాంటిది

Jun 14 2023, 10:37

2 వేల నోటు.. మద్యం షాపుల ద్వారా భారీ దందా❓️

నేతల ఇళ్ల కలుగుల్లోంచి బయటికొస్తున్న నోట్లు

రోజు అమ్మే మద్యం అమ్మకాల్లో 80 కోట్లలో సగం 2 వేల నోట్లే!

రాష్ట్రంలో ఒక్కో మద్యం షాపులో సగటున రోజుకు రూ.2లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో దాదాపు సగం అంటే రూ.లక్ష.. రూ.2 వేల నోట్లే వచ్చాయంటూ బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. రూ.2 వేల నోట్లను వ్యక్తిగతంగా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20 వేల పరిమితి ఉంది. అదే మద్యం షాపు ద్వారా అయితే అపరిమితంగా నోట్లు మార్చుకోవచ్చు. మద్యంషాపుల నుంచి వచ్చే నోట్లను బ్యాంకులు తిరస్కరించలేవు. కానీ గత కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల నుంచి వస్తున్న నోట్లను చూస్తుంటే బ్యాంక్‌ మేనేజర్లలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల పెద్ద నోట్లు వద్దని చెబుతున్నట్లు తెలిసింది.

షాపులే మార్పిడి కేంద్రాలు...

గత రెండు మూడేళ్ల నుంచి రూ.2వేల నోట్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. బ్యాంకులకు వెళ్లిన నోట్లను ఆర్‌బీఐ తీసుకుని, వాటి స్థానంలో ఇతర చిన్న నోట్లు ముద్రించింది. దీంతో దాదాపుగా రూ.2వేల నోట్లు లేవనే అందరూ భావించారు. గత నెల 19న ఆ నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగానే అనూహ్యంగా ఇప్పటివరకూ కనిపించకుండా పోయిన గులాబీ నోట్లు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20వేల పరిమితి ఉంది. ఒకేసారి రూ.50వేలు దాటి జమచేస్తే పాన్‌ నంబరు ఇవ్వాలి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన రాజకీయ నేతలు... మద్యం షాపులను ఎంచుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని 2934 మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి. అక్కడ పనిచేసే సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు అంతా అధికార పార్టీకి సన్నిహితులే. రాష్ట్రంలో రోజుకు రూ.80కోట్ల మద్యం వ్యాపారం సాగుతుంటే అందులో దాదాపు రూ.60కోట్లు ఈ షాపుల్లోనే జరుగుతోంది. ఇప్పుడు ఆ నగదులో ఎక్కువగా గులాబీ నోట్లే కనిపిస్తున్నాయి.

ఎలా చేస్తున్నారు?

ప్రభుత్వ మద్యం షాపుల్లో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల అమ్మకాలుంటాయి. అందులో రూ.2వేల నోట్లను చేర్చేందుకు పలు మార్గాలను ఎంపిక చేసుకున్నారు. తొలుత కొందరు నాయకులు వారి డ్రైవర్లు, అటెండర్లకు పెద్ద నోట్లు ఇచ్చి మద్యం కొనుగోళ్ల ద్వారా మార్పించే ప్రయత్నాలు చేశారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత....ఇలా చేస్తే సెప్టెంబరు నాటికి మొత్తం నోట్లు మార్చడం సాధ్యపడదని తేలిపోయింది. దీంతో ఒకేసారి నోట్లు మార్చుకునేలా షాపుల్లోని సూపర్‌వైజర్లతో డీల్‌ మాట్లాడారు. ఎలాగూ మనోళ్లే కావడం, మరీ కాదంటే ఎంతోకొంత కమీషన్‌ ఇచ్చి అయినా నోట్లు మార్చేలా సెట్‌ చేశారు. వాస్తవానికి షాపుల్లో సామాన్య వినియోగదారులు రూ.2వేల నోటు ఇస్తే తీసుకోవడం లేదు. కనీసం రూ.వెయ్యికి పైగా కొనుగోలు చేస్తేనే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో మందు తాగేవాళ్లలో ఎవరూ రూ.వెయ్యి కొనుగోళ్లు చేయరు. అలాంటప్పుడు ఇన్ని పెద్ద నోట్లు షాపులకు ఎలా వస్తున్నాయి? అంటే డీల్‌ సెట్‌ చేసుకున్న వారు రోజూ ఉదయం సూపర్‌వైజర్లకు మార్చాల్సిన నోట్లు ఇస్తారు. అనంతరం ఆ మేరకు వ్యాపారం జరిగాక ఫోన్‌ చేయగానే నేతల మనుషులు వచ్చి వాటిని తీసుకెళ్తారు. మరికొన్ని చోట్ల రోజంతా వ్యాపారం సాగుతుంది. తర్వాత రోజు ఉదయం ఆ నగదును బ్యాంక్‌లో జమ చేసే సమయంలో చిన్న నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లు పెడుతున్నారు. మరికొందరు చోటా నేతలు బెల్టు షాపుల కోసం పెద్దఎత్తున కొనుగోలు చేసే మద్యాన్ని పూర్తిగా రూ.2వేల నోట్లతోనే కొంటున్నారు.

పెట్రోల్‌ బంకుల్లోనూ...

మద్యం షాపుల్లో అమ్మే రూ.60 కోట్లలో దాదాపుగా రూ.40 కోట్లు పెద్దనోట్లేనని తెలిసింది. ఇవి కాకుండా కొందరు పెట్రోల్‌ బంకులను నోట్ల మార్పిడికి కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. రూ.10కోట్ల మేర మార్చేస్తున్నారు. వెరసి..ఒక్క రోజులోనే .50కోట్లు విలువైన పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకుంటున్నారు. ఇలా నెలలో 1500కోట్ల వరకు మార్చేఅవకాశం ఉంది..........