నిజందాగదుక్షణంఆగదు

1 hour and 45 min ago

తెలంగాణలో మిగిలిన స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలోని మిగిలిన మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం - రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్- వెలిచాల రాజేందర్‌రావు, హైదారాబాద్ - మహ్మద్ సమీర్‌

నిజందాగదుక్షణంఆగదు

2 hours and 7 min ago

సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

 | కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగాయి. బస్‌యాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు

 తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం.. 

‘ఆ నాటి నుంచి ఈనాటి వరకు మన పోరాటం నీళ్లు. తెలంగాణ బతుకే నీళ్లపై పోరాటం. ఈ జిల్లాల్లో మంత్రులున్నారు. ఇరిగేషన్‌ మినిస్టర్‌ స్వయంగా ఇక్కడ ఉన్నడు. వీళ్లు దద్దమ్మల్లా పోయి నాగార్జునసాగర్‌ కట్టపై కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి అప్పగించారు. మీరంతా కళ్లారా చూశారు. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. 1956 నుంచి ఈ నాటి వరకు మనకు శత్రువే కాంగ్రెస్‌ పార్టీ. 56వ సంవత్సరంలో ఏపీలో కలిపి 58 సంవత్సరాలు అనేక రకాలుగా గోసపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. మొన్న ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చింది. నోటికి మొక్కాలి అన్ని హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి.. సక్కగా ఉన్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి మనకు అవస్థలు తెచ్చిపెడుతున్నారు. రైతుబంధు కావాలని రైతులు అడిగితే చెప్పుతోని కొడుతా అని ఒక మంత్రి మాట్లాడుతున్నడు. చెప్పులు మీకే లేవు రైతులకు కూడా ఉంటయ్‌, వాళ్ల చెప్పులు చాలా బందబస్తుగా ఉంటయ్‌ అని నేను చెప్పిన’ అంటూ గుర్తు చేశారు కేసీఆర్‌.

 దద్దమ్మలు సాగర్‌ను కేంద్రం చేతుల్లో పెట్టారు.. 

‘బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో 18 పంటలకు ఏమాత్రం వెనుకాముందు కాకుండా బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టంతా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించాం. ఇవాళ ఈ రోజు ఏమైంది? సాగర్‌లో నీళ్లు ఉండే.. ఇవ్వగలిగే అవకాశం ఉండే. ఈ దద్దమ్మలకు దమ్ములేక.. ప్రాజెక్టును తీసుకుపోయి కేఆర్‌ఎంబీ చేతులో పెట్టి పంటలన్నీ ఎండబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండినయంటే ఇదే మొదటిసారి. రైతుబంధులో ధగా.. రైతుబీమా ఉంటదో ఊడుతదో తెలియదు. బ్రహ్మాండంగా కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రెప్పపాటు పోని కరెంటు కటుక బంద్‌చేసినట్లే మాయమైంది. ఎక్కడికి పోయింది కరెంటు ? ఏమైంది కరెంటుకు ? వీళ్లు కొత్తగా గడ్డపారలు పట్టి తవ్వి పని చేయాల్సిన అవసరం లేకున్నా కేసీఆర్‌ తొమ్మిదేళ్లు ఇచ్చిన కరెంటును కూడా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నరు. కరెంటు ఎందుకు ఆగమవుతుంది’ అంటూ రేవంత్‌ సర్కారును కేసీఆర్‌ ప్రశ్నించారు.

 ప్రజలను ఎందుకు బాధపెడుతున్నరు ? 

‘ప్రజలను ఎందుకు బాధలుపెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయచేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ? మిషన్‌ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్‌ ఏరియాలో.. మున్సిపల్‌ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్‌ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. మీ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్‌ పక్కకు జరుగంగనే ఎందుకు మాయమై పోయినయ్‌ ? ఎందుకు బాధపడుతున్నరు ? సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

 కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి.. 

‘ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కేసీఆర్‌ను తిట్టడం ఒకటే పని. కేసీఆర్‌ను తిట్టాలి పబ్బం గడుపుకోవాలి తప్పా.. పంటలు ఎండబెట్టారు.. రైతుబంధు ఎగొట్టారు.. రైతుబంధు ఐదెకరాలు అని మాట్లాడుతున్నారు. ఏం పోయింది మీ అబ్బసొత్తా ? ఇచ్చేందుకు మీకు ఏం బాధైంది. ప్రభుత్వం సహాయం లేకుండా ప్రపంచంలో ఎక్కడా రైతులు వ్యవసాయం చేయడం లేదు. దాన్ని గమనించే భారతదేశంలో తొలిసారిగా రైతులకు అండగా ఉండాలని, అప్పులు తీరాలని బడ్జెట్ నుంచి రూ.15వేలు-రూ.16వేలకోట్లు పెట్టి రైతుబంధు ఇచ్చాం. నేను వస్తుంటే ఆర్జాలబావి దగ్గర బస్సును రైతులు ఆపారు. సార్‌ 20 రోజులైంది ధాన్యం తెచ్చి ధాన్యం కొనడం లేదని చెప్పారు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి ? బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోదీ వడ్లు కొన అని మొండి కేస్తే.. ముఖ్యమంత్రితో సహా తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో ధర్నా చేసి.. నరేంద్ర మోదీ మెడలు వంచి.. మా తెలంగాణ పండిస్తున్నది. న్యాయంగా కొనాలి అని చెప్పి కొనుగోలు చేసేలా చేశాం. మద్దతు ధర రూపాయి తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో వేశాం’ అన్నారు.

నిజంనిప్పులాంటిది

2 hours and 12 min ago

కేసీఆర్ కాన్వాయ్ కి రోడ్డు ప్రమాదం?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఈరోజు బస్సు యాత్ర ప్రారంభించిన విషయం పాఠకులకు తెలిసిందే.

నేడు ఆయన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి యాత్ర ప్రారంభించారు. వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది.

ఒకదాని కొకటి 10 వాహ నాలు వరుసగా ఢీకొన్నా యి. దీంతో పలువురికి గాయలైనట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

నిజంనిప్పులాంటిది

2 hours and 13 min ago

తెలంగాణ జిల్లాలలో కొనసాగుతున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ భ‌వ‌న్ నుంచి పోరుయాత్ర‌కు కేసీఆర్ బుధవారం శ్రీకారం చుట్టారు.

భ‌వ‌న్‌కు చేరుకున్న కేసీ ఆర్‌కు మ‌హిళ‌లు మంగ‌ళ‌ హారతుల‌తో ఘ‌నస్వాగ‌తం ప‌లికారు. మొద‌ట‌ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేశారు.

కేసీఆర్. అనంత‌రం కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభ‌మైం ది. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌కు కేసీఆర్ అభివాదం చేశారు. బాణాసంచా కాల్చి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు సంబురాలు చేసుకున్నారు.

నేటి నుంచి 17 రోజుల పాటు సాగే ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాల గూడలో ప్రారంభమై సిద్దిపే టలో జరిగే బహిరంగసభతో ఈ యాత్ర ముగుస్తుంది.

నిజందాగదుక్షణంఆగదు

2 hours and 33 min ago

TS: కెసిఆర్ కు సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్‌కు నేను సవాల్ విసురుతున్నా.. నువ్వు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా..? నీకు దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రా..? హరీష్ రావు.. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు.. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తాం-సీఎం రేవంత్‌రెడ్డి

నిజందాగదుక్షణంఆగదు

2 hours and 49 min ago

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు..

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవలపై ఆర్బీఐ ఆంక్షలు.. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఆన్‌లైన్‌ సేవల్లో లోపాలు గుర్తించిన ఆర్బీఐ.. ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాలు ఓపెన్‌ చేయొద్దని ఆదేశం.. క్రెడిట్‌ కార్డులు కూడా జారీ చేయొద్దన్న ఆర్బీఐ.

నిజందాగదుక్షణంఆగదు

3 hours ago

లోక్సభ ఎలక్షన్ల తర్వాత..పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం

పంచాయతీ ఎన్నికలు..

 ఈసీ కీలక నిర్ణయం

తెలంగాణలో లోక్ సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్ లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ను ఆదేశించింది. 

రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగిసింది. ప్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది.

నిజంనిప్పులాంటిది

3 hours ago

రేపు నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు ఏప్రిల్ 25 తన సొంత నియోజక వర్గం పులివెందులలో నామినేషన్ వేయనున్నారు.

నామినేషన్ కు ముందు సీఎం జగన్ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజ రవుతారు.

అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యా లయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు...

నిజంనిప్పులాంటిది

3 hours ago

సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణలో పాల్గొన్న గుత్తా అమిత్ కుమార్ రెడ్డి

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనెల 27వ తేదీ నుండి ఉరుమడ్ల గ్రామంలో మూడు రోజులపాటు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ద్వారా 30 సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీ శ్రీనివాస రావు గురూజీ గారిచే గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ క్లాస్ ద్వారా ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

కరపత్రాల ఆవిష్కరణలో GVR ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు తో కలిసి మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి, ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు. దీనివల్ల మీరు యోగా యొక్క ప్రాచీన ఆచరణాలు, ధ్యానం మరియు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను చక్కగా పొందుతారు అన్నారు.

సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మేహం, ఉబ్బసం మొదలగు వాటిని అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైన సైటీస్, చర్మవ్యాధులు, గ్యాస్టిక్ మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చునని తెలియజేశారు.

కాబట్టి ఈ యొక్క ఉరుమడ్ల గ్రామంలో నిర్వహించబడు సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు చిట్యాల మండల ప్రజలు యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా యువసేన నల్గొండ జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జన్నపాల శ్రీను, బోయ స్వామి, పోలగోని శ్రీశైలం, మర్రి అశోక్, ఉడుగు పాండు, పోలగోని శంకరయ్య, మర్రి రమేష్, మాధగోని వెంకన్న, పోలగోని నరేష్, దినేష్, స్వామి, శివ, నరేష్, దిలీప్, లింగస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

4 hours ago

భారీ రోడ్ షో కార్యక్రమం లో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ ఎన్నికల ఇంచార్జ్ బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రె

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి నియోయోజక వర్గంలో

నేడు అమనగల్ నుంచి జి మాడుగుల వరకు భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు ZPTC లు MPTC మున్సిపల్ చైర్మన్ లు

కౌన్సిలర్ మాజీ సర్పంచ్ లు వివిధ హోదాలో వున్న ప్రజా ప్రతినిధులు,రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..