/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz పాలకుల నూతన ఆర్థిక విధానాల వల్ల హక్కులకు భంగం: సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి Vijay.S
పాలకుల నూతన ఆర్థిక విధానాల వల్ల హక్కులకు భంగం: సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి


 

ఐక్యత ,పోరాటం, సామాజిక భాద్యత లతో టాప్రా పనిచేస్తుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెటర్నరీ భవన్ లో జరిగిన టాప్రా జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సౌకర్యం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెన్షన్ సౌకర్యం తొలగించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నరేంద్రమోడీ హటావో నినాదం బలపడుతుందని, దానిని అమలు చేసేందుకు మనమంతా కృషి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం సర్వీసుల్లో ఉన్నవారు, పెన్షనర్లు కలిసి కట్టుగా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి మాట్లాడుతూ పాలకులు అవలంభిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల రిటైర్డ్ పర్సన్స్ ల హక్కులకు భంగం కలుగుతుందని ఆయన అన్నారు. రూపాయి విలువ తగ్గించడంతో ప్రజలందరూ సంక్షోభం లో పడిపోయరని, స్వాతంత్రం వచ్చిన నాటికి, నేటికి పేదరికం పెరిగిపోయిందని ఆయన అన్నారు. కానీ బడా పారిశ్రామికవేత్తలైన ఆదాని, అంబానీల ఆస్తులు మాత్రం అనేక రెట్లు పెరిగాయని ఆయన అన్నారు. టాప్రా జిల్లా అధ్యక్షులు కడారు రమేష్ బాబు అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఎల్.అరుణ మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో మార్చి 8 న జరిగే "మహిళా దినోత్సవం" ను ఘనంగా జరుపాలని కోరారు. ఈ సమావేశంలో టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మ కంటి బాలరాజు గత ఏడాది నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు అంజయ్య, ఉపాధ్యక్షులు మాటూరి బాలేశ్వర్, నాయకులు ఎస్కే లతీఫ్, శకుంతల, బుగ్గయ్య, మదిర మల్లేశం, పోలి శంకర్ రెడ్డి, జగన్, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి జిల్లా కమిటీ పక్షాన ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి అందజేశారు.

వలిగొండ మండలంలోని పలు గ్రామాలలో గావ్ చలో... ఘర్ చలో కార్యక్రమం


గావ్ చలో గర్ చలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం లోని నాగారం, మాందాపురం, సంగెం గోకారాం, సుంకిషాల, నేమిలికాల్వ,గొల్నేపల్లి పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఈ పదేండ్ల కాలంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మొదలైన వాటి గురించి ప్రజలకు తెలియజేయడానికి ఉపాధి హామీ కూలీల దగ్గరకు ,ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరనైనది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్చార్జ్, భువనగిరి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాచకొండ కృష్ణ, ఏలే చంద్ర శేఖర్, కణతల అశోక్ రెడ్డి, బచ్చు శ్రీనివాస్,కందుల తానీషా, యాది రెడ్డి,మంద నర్సింహా,కందికట్ల లక్ష్మణ్ పోలు నాగయ్య బర్ల సత్తయ్య, మంగ జగన్,మందుల నాగరాజు, బైరు మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.

రూ. 500 కు సిలిండర్... ఎంపిక ప్రక్రియ ఇదే : కౌన్సిలర్ పంగ రెక్క స్వామి


◽మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను కౌన్సిలర్ పంగ రెక్క స్వామి అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు గుర్తించనున్నారు.

◽ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకెళ్లి రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, కస్టమర్ నంబర్, పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీదును 8 వ వార్డ్ లో పరిశీలిస్తున్నాతు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తెలియజేసారు 

◽అర్హతలుంటే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబితగోపల్ , ఆర్. పి ధనలక్ష్మి, సునీత, లక్ష్మి వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

చిత్తాపురం గ్రామంలో రెండవ రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో గురువారం రెండో రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం పరిసరాలను శుభ్రం చేశారు . గ్రామపంచాయతీ కార్యదర్శి జలంధర్ రెడ్డి పారిశుద్ధ్య చర్యల పై ప్రజలకి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి కిరణ్మయి, ప్రధానోపాధ్యాయులు విజయానంద్ ,టీచర్ జ్యోతి , అంగన్వాడి టీచర్ మంజుల, ఆశా వర్కర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం


భువనగిరి మండలం చీమల కొండూరు పరిధిలో ఉన్న శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో, వృద్ధులకు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని వారి సేవలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరం అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, వారు పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని ,వారు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు జీలుగు కవిత సతీష్ పవన్, ఎల్లంల జంగయ్య, నానం కృష్ణ, తంగళ్ళపల్లి శ్రీనివాస్, మట్ట శంకర్ బాబు, తోటకూరి వెంకటేశ్ యాదవ్ నుచ్చు నాగయ్య ఎడ్ల శ్రీనివాస్ పిట్టల రజిత బింగి బిక్షపతి ఓరుగంటి ఆంజనేయులు చిన్నం శ్రీనివాస్ మంగ ప్రవీణ్ మచ్చ పాండు చుక్క స్వామి సాల్వే ఉపేందర్ దయ్యాల శ్రీశైలం పిట్టల వెంకటేశం గిరీష్ తదితరులు పాల్గొన్నారు

వలిగొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని నియోజకవర్గ మరియు వలిగొండ అభివృద్ధి ప్రదాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు వలిగొండ మండలం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని వైభవంగా నిర్వహించినారు.

 భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 100 మంది రక్తదానము ఇచ్చినారు. అన్నదాత ఏర్పాటు చేసిన కొండూరు భాస్కర్ కుటుంబ సభ్యులుప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారుఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ కార్యకర్తలు అధ్యక్షులు అనిల్ యువసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించాలి; లంబాడి హక్కుల పోరాట సమితి


సచివాలయంలో లంబాడి హక్కుల పోర సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు బిర్లా ఐలన్న సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిదృష్టికి తీసుకెళ్లాలని లంబాడి ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించి, యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ నిర్మించుట గురించి సచివాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్, రాష్ట్ర నాయకులు దిరావత్ రవి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, జిల్లా నాయకులు సముదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు  లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ

భువనగిరి: విద్యార్థినుల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: MRPS


యాదాద్రి భువనగిరి జిల్లాలో మొన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగిన సంఘటనపై ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ జండగే సార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ...

బాధిత కుటుంబనికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

-రెండు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.

-సంక్షేమ హాస్టల్ ల్లా అభివృద్ధికి కలెక్టర్ స్థాయి అధికారి తో కూడిన కమిటీ వెయ్యాలి. హాస్టల్ వార్డెన్ హాస్టల్ లో ఉండి రోజువారీగా తనికి చేసి విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ ,

MSP జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ, 

MRPS రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ ,పొద్దుటూర్ గ్రామ మాజీ సర్పంచ్ దుబ్బ లింగం మాదిగ ,సోలిపేట్ మాజీ MPTC మందాల రామస్వామి మాదిగ ,MSP జిల్లా ఉపాధ్యక్షుడు కోళ్ల జహంగీర్ మాదిగ ,

MRPS జిల్లా కార్యదర్శి కుశంగాల కుమార్ మాదిగ లు తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ తో బాధపడుతున్న మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత


గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మిత్రుడు ఆవేదనను అర్థం చేసుకున్న 10 వ తరగతి 2002-2003 బ్యాచ్ కు చెందిన మిత్రులు మేము సైతం అతనికి అండగా ఉంటాము అని నిరూపించారు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆనందంలో కాదు ఆపదలో కూడా తోడు ఉంటాము అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ గౌస్ బాబా, ద్యనబోయిన స్వామి, మిర్యాల శ్రీనివాస్, బోల్లు వలిబాష, గొలనుకొండ నరేష్, కూర వలయ్య, రామకృష్ణ, కాలనీ వాసులు బత్తిని బాలశెట్టి, బల్గూరు నరేష్ రెడ్డి, వనం నరేష్ లు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 10, 11 వ తేదీల్లో జరుగు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ జయప్రదం చేయండి : SFI గర్ల్స్ వలిగొండ మండల కమిటి


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ మండల నాయకురాలు ఆకుల అక్షిత మాట్లాడుతూ .. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈనెల 10,11వ తేదీల్లో జరుగు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ జయప్రదం చేయాలన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు అరికట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు .ఈ కన్వెన్షన్ లో అమ్మాయిల పై నిత్యం జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ..ఆడపిల్లల రక్షణకై ..కన్వెన్షన్ నివేదిక రూపొందించుకొని ,భవిష్యత్తు పోరాటాలకు ప్రణాళిక తయారు చేస్తారన్నారు. ఈ కన్వెన్షన్ కి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొననున్నారు, అని వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఇంజమురి ఉమ, కేశాబాయిన మేఘన, పిల్లలమర్రి వినిత, ఎండి ఫెజియ,మొరపక పావని తదితరులు పాల్గొన్నారు.