/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి ఎస్సీ హాస్టల్ లో విద్యార్థినుల ఆత్మహత్య....వార్డెన్ శైలజ సస్పెండ్ Vijay.S
భువనగిరి ఎస్సీ హాస్టల్ లో విద్యార్థినుల ఆత్మహత్య....వార్డెన్ శైలజ సస్పెండ్


యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ శైలజ సోమవారం సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహము లో ఫ్యాన్ కు ఉరేసుకుని విద్యార్థినిలు మృతి చెందిన ఘటన అనుమానాస్పదంగా ఉందని, హాస్టల్ వార్డెన్ శైలజ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని పలువురు ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ ఘటనపై విచారణ జరిపించిన జిల్లా కలెక్టర్ హనుమంతు కే జేండగే , వార్డెన్ శైలజ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

భూదాన్ పోచంపల్లి ని పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి చేస్తాం: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


భూదాన్ మున్సిపాలిటీ కేంద్రంలోని టూరిజం పార్కులో మున్సిపాలిటీ మరియు మండల అభివృద్ధి రివ్యూ మీటింగ్ ని అధికారులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలోని పలు సమస్యలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో భూదాన్ పోచంపల్లి పెద్ద చెరువు మినీ ట్యాంక్బండ్ గా ఏర్పాటు చేస్తామని ,హామీలు ఇచ్చి వదిలేసారని అని తెలిపారు. 

అలాగే భూదాన్ పోచంపల్లి కి ఇతర రాష్ట్రాల నుండి ఇతర దేశాల నుండి చీరలకు కొనుగోలుకు ...పర్యాటకులు వస్తుంటారని, కానీ ఇక్కడ వసతుల లేమితో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారని ,ప్రభుత్వపరంగా అన్ని వసతులు ఏర్పాటు చేసి పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందేలా చేస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ విజయలక్ష్మి, ఎమ్మార్వో ,ఎంపీడీవో, తదితర విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు .. తేజ


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం 

అనాజిపురం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్,యువకులకు క్రీకెట్ కిట్టు పంపిణీ హాజరైన 

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా తేజ మీకు ఏ సమస్యలున్నా పరిష్కరించే బాధ్యత నాది,క్రమశిక్షణతో కష్టపడి చదివే బాధ్యత మీది,పాఠశాల అభివృద్ధికి నా వంతు సాయంగా10,000/వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినారు.యువత క్రీడలలో అభివృద్ధి చెందాలి చల్లా తేజ అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కెమ్మోజు బాలచారి కుటుంబ సభ్యులను పరామర్శించి10,000/వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన చల్లా తేజ ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయుడు దశరథ మాజీ ఉప సర్పంచ్ వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మురళి కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ అజాద్ యువకులు తరితరులు పాల్గోన్నారు.

లింగరాజు పల్లి లో రామాలయ నిర్మాణం ... దాతలు గంధమల్ల మల్లమ్మ బాలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో పుట్టిన ఊరు మీద ప్రేమతో గ్రామంలో నూతనంగా రామాలయ నిర్మాణం చేపట్టిన లింగరాజు పల్లి వాస్తవ్యులు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి గంధ మల్ల బాలయ్య మల్లమ్మ తమ సొంత నిధులతో ఊరిలో రామాలయ నిర్మాణం చేపట్టారు. ఈ గుడి నిర్మా ణం చేపట్టడంతో గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విరివురు దగ్గరుండి నిర్మాణ పనులు చూసుకుంటూ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి అందులో సీతారాముల వారి విగ్రహాలు ప్రతిష్టించాలని వారి కోరిక ఉన్నందున వారికి గ్రామ ప్రజలు సహకరించాలని ఆ సీతా రాముల కరుణాకటాక్షం గ్రామ ప్రజలపై ఉండాలని గుడి నిర్మిస్తున్న గంధమల్ల మల్లమ్మ బాలయ్య కి సీతారాముల కరుణ కటాక్షం ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి కల్పించాలని సీతారామచంద్రస్వామి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బాల్క సుమన్ దిగజారుడు రాజకీయాలను మానుకోవాలి: యూత్ కాంగ్రెస్ వలిగొండ పట్టణ అధ్యక్షులు పూసుకూరి లింగస్వామి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పుసుకూరి లింగస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ వ్యవహార శైలిపై లింగస్వామి తీవ్రంగా స్పందించారు. బిఆర్ఎస్ నేతల మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మనిషిలాగ మాట్లాడుతూ బ్రతకాలని సూచించారు. బాల్క సుమన్ ఇంకోసారి వింత జంతువు లాగా ప్రవర్తించి అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని 

హెచ్చరించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్యంగా మాట్లాడే బాల్క సుమన్ లాంటి నేతలకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే బాల్క సుమన్ ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

శ్రీ రామలింగేశ్వర నాట్య కళామండలి అధ్యక్షులుగా ఎన్నికైన పైళ్ళ దామోదర్ రెడ్డిని సన్మానించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


శ్రీ రామలింగేశ్వర నాట్య కళా మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పుడమి సాహితీ పురస్కార గ్రహీత దామోదర్ రెడ్డి ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆత్మకూరు ఎం: శ్రీ రామ లింగేశ్వర నాట్య కళా మండలి అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన పైళ్ళ దామోదర్ రెడ్డి ని గౌరవంగా సన్మానించిన ప్రభుత్వ విప్ ,ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బీర్ల ఐలయ్య . మండలంలో నాటక కళా రంగంలో తనదైన శైలిలో ప్రత్యేక స్థానాన్ని పొందిన సీనియర్ కళాకారుడు మండల కేంద్రానికి చెందిన పైళ్ళ దామోదర్ రెడ్డి , ఇటీవల పుడమి సాహితీ వేదిక ద్వారా పురస్కారాన్ని అందుకోగా నేడు వారు స్థానిక శ్రీరామ లింగేశ్వర నాట్య కళా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ,ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఏఐఎస్ఎఫ్ ,ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ ముట్టడి


అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సమస్యలు పరిష్కరించాలని ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా ...అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్ ,పెరబోయిన మహేందర్ లు మాట్లాడుతూ ...బీబీనగర్ లోని ఎయిమ్స్ లో అలాగే యాదాద్రి దేవస్థానంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, జిల్లాలో ఉన్న పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, ఈ జిల్లాలో డ్రగ్స్ గంజాయిని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వస్తూపుల అభిలాష్ ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ..యాదాద్రి దేవస్థానం నిధులతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని . పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని, బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జిల్లా కేంద్రంలో ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో జరిగిన ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ముట్టడి కార్యక్రమం కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత కొనసాగింది పోలీసులు విద్యార్థి ,యువజన నాయకుల మధ్య తోపులాట జరిగింది కలెక్టరేట్ లోనికి ప్రదర్శనగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .వారు సానుకూలంగా చదివి విన్న తర్వాత స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి నహీం సుద్దాల సాయి ,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సూరారం జానీ ,ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల వెంకటేష్ ,కంబాల రాజు ,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మారుపాక లోకేష్, ఎం జానీ దినేష్ ,కళ్యాణ్ ,సాయి చరణ్, సుమన్, ప్రవీణ్ ,ప్రణయ్ ,రవితేజ ,దుర్గాప్రసాద్ ,సుమన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలని భువనగిరి టౌన్ సిఐ కి ఫిర్యాదు చేసిన ఎన్ ఎస్ యూ ఐ నాయకులు


రెండు గంటలకి తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యూఐ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్ మరియు ఎన్ఎసయూఐ జిల్లా, మండల ,నాయకులతో కలిసి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భువనగిరి పట్టణ సిఐ సురేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెప్పు చూపిస్తూ ,అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం బీఆర్ఎస్ నేతలు, జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, వికాస్, బాలాజీ ,సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాలు మారుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగటం లేదు: ఏబీవీపీ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నోముల దీప్తి


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని, ప్రభుత్వ బాలికల ఎస్.సి హాస్టల్లో 10వ తరగతి విద్యార్ధినిలు భవ్యశ్రీ , వైష్ణవి ఆత్మహత్యల విషయంలో ...రాష్ట్ర ప్రభుత్వo సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఏబీవీపీ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ నోముల దీప్తి అన్నారు. ఈ సందర్బం గా దీప్తి మాట్లాడుతూ .. భువనగిరిలో 10వ తరగతి విద్యార్ధినిల ఆత్మహత్యల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం తీరు విచారకరం.ఈ ఘటన జరిగి 2 రోజులు కావస్తున్న ప్రభుత్వం నుంచి సరియైన స్పందన కొరవడింది.ఆత్మ హత్య అంటూ చెప్తున్న హాస్టల్ వార్డెన్ శైలజ, హాస్టల్ బ్యూటర్ భువనేశ్వరి, బాలికల ఉన్నత పాఠశాల పీఈటి ప్రతిభ, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, వంట మనిషి సుజాత ల తీరుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇరువురు విద్యార్థిని లు చనిపోయిన రెండు గంటల తర్వాత పోలీసు వారికి, మరో రెండు గంటల తర్వాత విద్యార్థినుల తల్లిదండ్రులకు హాస్టల్ సిబ్బంది సమాచారాన్ని చేరివేసిన తీరు చూస్తుంటే ఇది ఆత్మహత్య కాదు హత్య నన్న ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడితే విద్యార్థినుల ఒంటిపై గాయాలు ఎందుకు ఉన్నాయి... అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. నేటి ప్రభుత్వం కూడా ఈ విషయాలపై దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. "ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు"అంటూ చెప్పే మన తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లల జీవితాలను చీకటి మయం చేస్తూ వారిపై హత్యలు, హత్యలను ఆత్మహత్యలు గా మార్చే తీరు అంతకంతకు పెరుగుతూ ఉన్న మన ప్రభుత్వాల తీరు మాత్రం పేపర్లకే పరిమితం అవుతుంది. వారికి ఓట్లు మీద, వారి పదవులను కాపాడుకోవడం లో ఉన్న శ్రద్ధ చదువుకుంటున్న ఆడపిల్లల యొక్క జీవితాల రక్షణ మీద లేదేమో అన్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంది. పేద కుటుంబంలో పుట్టి మంచిగా చదువుకొని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలనుకున్న ఇద్దరి ఆడపిల్లల యొక్క జీవితం 15 సంవత్సరాల లోనే ఆగిపోయి వారి కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచి వేసింది. ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుకునే పిల్లలకు మౌలిక సదుపాయాలతో పాటు ఆడపిల్లలకు రక్షణ కూడా లేనటువంటి పరిస్థితి మనం రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే చదువు ఆగిపోతుంది అదే హాస్టల్స్ లో ఉండి చదువుకోవాలి అనుకుంటే కొంత మంది హాస్టల్స్ సిబ్బంది ప్రవర్తన కారణం గా ప్రాణమే పోతుంది. ఏమో అనే దానికి ఈ ఘటన దారి తీస్తుంది. రాత్రి సమయంలో ఆడపిల్లల హాస్టల్స్ లోకి అబ్బాయిలు రాకూడదనే విషయాన్ని మరిచి ,రాత్రి సమయంలో హాస్టల్స్లోకి వచ్చిన, ఆటో డ్రైవర్ ఆంజనేయులు, తనకు సహకరించిన ఇతర సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆటో డ్రైవర్లు ఈ హాస్టల్స్ లోకి రాత్రి సమయంలో వస్తున్నారని ఇదివరకే కంప్లైంట్ ఇచ్చిన దీనిపై ఎటువంటి స్పందన లేకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నామని చెప్పినా వాటిని అమలుపరిచే విధానంలో మన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక దశా దిశా లేకుండా ఉన్నాయి అనేదానికి ఈ ఘటనను మనo ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఆడపిల్లలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని, భవ్య శ్రీ , వైష్ణవి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, దర్యాప్తును వేగవంతం చేస్తూ సమగ్ర విచారణ చేయాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ లో చదువుతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని అమె అన్నారు.

వలిగొండ లోని ప్రభుత్వ హాస్టల్స్ ను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించాలి: సిపిఎం డిమాండ్


వలిగొండ మండలంలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాల, మోడల్ స్కూల్ హాస్టల్ లను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ,వెంటనే సందర్శించి.. విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని... సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.

    ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్ల వార్డెన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా.. భువనగిరిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వివిధ రకాల సంక్షేమ హాస్టల్స్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలు మోడల్ స్కూల్లో భాగమై ఉన్న హాస్టలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారికి అన్ని రకాలుగా అవగాహన కల్పించే విధంగా తక్షణ చర్యలు జిల్లా ,మండల స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ,హాస్టల్లను సందర్శించి వారికున్న సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.

  అనేక సంవత్సరాలుగా హాస్టల్లో సౌకర్యాలు లేవని ఎన్నిసార్లు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేసిన గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ,నూతనంగా ఏర్పడిన ప్రభుత్వమైన సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించి, తగిన కనీస సౌకర్యాలు కల్పించాలని, వారికి అన్ని రకాల అవగాహన తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.