/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Parliament: విపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా Yadagiri Goud
Parliament: విపక్షాల ఆందోళన.. లోక్‌సభ వాయిదా

దిల్లీ: పార్లమెంట్‌ (Parliament) వర్షాకాల సమావేశాలను మణిపుర్‌ అల్లర్ల (Manipur Issue) అంశం కుదిపేస్తోంది.

మణిపుర్‌ అల్లర్లు, దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్‌సభ (Loksabha)లో విపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు..

విపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్‌ ప్రశ్నోత్తరాల గంట చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అటు రాజ్యసభ (Rajya Sabha)లోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మణిపుర్‌ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. ప్రధాని మోదీ రాజ్యసభకు వచ్చి దీనిపై ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి..

అసలు సూత్రధారి సూర్యనారాయణే.. ఆయన వల్ల ఖజానాకు రూ.124 కోట్ల నష్టం

అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ వ్యాపారులతో కుమ్మక్కై ఖజానాకు రూ.124 కోట్ల నష్టం కలిగించారని పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ యర్రంరెడ్డి నాగిరెడ్డి హైకోర్టుకు నివేదించారు.

ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి సూర్యనారాయణేనని పేర్కొన్నారు. ఇతర నిందితులు, వ్యాపారులతో సూర్యనారాయణ వందల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ మాట్లాడారని, ఇందుకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

తమపై ఎలాంటి లావాదేవీలు నడిపారు, ఎలా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారు వంటి కీలక వివరాలను వ్యాపారులు వాంగ్మూలాల రూపంలో తెలియచేశారని వివరించారు. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇస్తే అంతుచూస్తానని, వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తానంటూ వ్యాపారులను సూర్యనారాయణ బెదిరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సూర్యనారాయణ నుంచి కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉందన్నారు.

అందువల్ల అతనికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు. అంతకు ముందు సూర్యనారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ఏ విచారణల నివేదికల ఆధారంగా కేసు నమోదు చేశారో.. ఆ నివేదికల్లో సూర్యనారాయణ పేరు లేదన్నారు. గవర్నర్‌ను కలిసి జీపీఎఫ్‌ మొత్తాల మళ్లింపుపై ఫిర్యాదు చేసిన నాటినుంచే సూర్యనారాయణకు ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయన్నారు.

అందులో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు. సూర్యనారాయణకు సైతం బెయిల్‌ ఇవ్వాలని, ఏ షరతులు విధించినా వాటికి కట్టుబడి ఉంటామని రవిప్రసాద్‌ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

సినీనటి జయసుధ.. నేడే బీజేపీలో చేరిక

సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

ఈరోజు జయసుధ కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో జయసుధ దేశరాజధానికి చేరుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో ఈరోజు సాయంత్రం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మధ్యాహ్నం జయసుధ కాషాయి కండువా కప్పుకోనున్నారు.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్,బండి సంజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు.

అయితే గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ పెద్దలు జయసుధకు ఎలాంటి హామీ ఇవ్వనున్నారో చూడాలి...

Tamilisai: వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై పర్యటన

వరంగల్‌: గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్‌, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె..శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు..

అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్‌, ఎన్.ఎన్.నగర్‌ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు.

రెడ్‌ క్రాస్‌ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్‌, నిత్యావసరాలను బాధితులకు ఆమె పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. సాయమందేలా చూస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను తమిళిసై పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ''భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి.

వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.'' అని తమిళిసై అన్నారు..

YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం (P Chidambaram) వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (GNTC)కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు..

ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిచ్చారంటే అర్థం చేసుకోవచ్చునని, వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు..

ఎక్స్ (ట్విటర్) వేదికగా చిదంబరం వైసీపీ, బీజేడీలను తీవ్రంగా దుయ్యబట్టారు. ''ఢిల్లీ సర్వీసుల అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిస్తున్నారంటే అర్థం చేసుకోగలం.

కానీ బీజేడీ, వైసీపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు'' అని తెలిపారు. ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు అధికారులతో కూడిన త్రిసభ్య అథారిటీలో యోగ్యత ఉందని ఈ రెండు పార్టీలు గుర్తించాయా? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారులు కోరం అవుతారని, వారిద్దరూ సమావేశాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి భాగస్వామ్యం లేకుండా నిర్ణయం తీసుకోవచ్చునని చెప్తున్న నిబంధన సరైనదేనని ఈ పార్టీలు గుర్తించాయా? ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రిపై పైచేయిగా వ్యవహరించవచ్చుననే నిబంధనలో పస ఉందని భావిస్తున్నాయా? అథారిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని సైతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చవచ్చుననే నిబంధన సరైనదని భావిస్తున్నాయా? అని నిలదీశారు..

జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాడు.

తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పారు.

నాదెండ్ల మనోహరను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అని తెనాలి నాయకులకు పవన్ సూచించారు.

మొత్తానికి మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమైంది.

SB NEWS

తెలంగాణ‌ మద్యం దుకాణాలకు సర్కార్ నోటిఫికేషన్?

ఎన్నికల ఏడాది ముందస్తు మద్యం దుకాణాలకు మహూర్తం ఖరారవుతోంది. వీలైతే ఈ ఏడాది కొంత ముందుగా అంటే ఆగష్టు 4న మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేలా ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 4నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఎక్సైజ్‌ శాఖ యోచిస్తోంది. 20 లేదా 221న లాటరీలను తీసి అదేరోజు దుకాణాలను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.కాగా ప్రతీయేటా నవంబర్‌లో మద్యం దుకాణాలకు వీలుగా ఆబ్కారీ ఏడాది ఆరంభమవుతోంది. అసెంబ్లిd ఎన్నికల కోడ్‌ అక్టోబర్‌లో రానుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం కొంత ముందస్తు చర్యలకు సిద్దమవుతోంది.

2021-23 ఏడాదులకు చెందిన కాలపరిమితి నవంబర్‌ 30తో ముగియనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. 2023-25 రెండేళ్లకుగానూ ఏ4 లైసెన్సుల గడువు ముగిశాక డిసెంబర్‌ 1నుంచి అమలులోకి రావాల్సి ఉంది. డిసెంబర్‌ 1నుంచి కొత్త రిటైల్‌ మద్యం దుకాణాలు అందుబాటులోకి రావాల్సింది. కానీ డిసెంబర్‌లో ఎన్నికల కారణంగా ముందస్తు నోటిఫికేషన్తో ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందునుంచే జూలై 1నుంచి కొత్త పాలసీ మొదలవడం సాంప్రదాయంగా ఉండేది. అయితే 2014 తర్వాత తెలంగాణలో మూడు దశల్లో గడువు పెంచడంతో డిసెంబర్‌ 1నుంచి కొత్త దుకాణాల ప్రారంభం జరుగుతూ వచ్చింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలుండగా, గతేడాది దరఖాస్తుల ద్వారానే రూ. 1400కోట్ల రాబడి సమకూరింది. ఇందులో గౌడ్‌లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం మద్యం దుకాణాలను రిజర్వ్‌ చేశారు. గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను రిజర్వేషన్‌ ద్వారా కేటాయించారు. మిగిలిన 1864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలను ఇప్పుడు ఒకేసారి తీసుకోనున్నారు. దరఖాస్తు రుసుముగా రూ. 2లక్షలు వసూలు చేస్తున్నారు.ఖజానా కళకళలాడేలా, వ్యాపారుల ఫ్రెండ్లీగా నూతన మద్యం పాలసీ రూపొందనుంది. జీహెచ్‌ఎంసీలో రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలను నిర్వహించుకునేలా సమయాన్ని పెంచిన ప్రభుత్వం అదే ఒరవడితో వ్యాపారులకూ పలు ప్రయోజనాలను వర్తింపజేసింది.

ఏపీ వ్యాపారుల ఆశక్తిని గుర్తించిన ప్రభుత్వం ఆదాయార్జనే లక్ష్యంగా పాలసీలో సిట్టింగ్‌ రూములకు ఎటువంటి ఆనుమతిలకుండా శ్లాబుల పెరుగుదల, రెట్టింపు దరఖాస్తు రుసుముల వంటి కీలక మార్పులతో రెండేళ్లకు ప్రస్తుత మద్యం పాలసీని ప్రకటించింది. వ్యాపారులకు ఊరట కల్గించేలా టెండర్‌తోపాటే సమర్పించే దరావత్తు మొత్తాన్ని (ఈఎండి) రూ. 5 లక్షలనుంచి రూ. 2లక్షలకు తగ్గించడంతోపాటు, లైసెన్సు రుసుములకు గతంలోఉన్న 6 వాయిదాలను 8 వాయిదాలకు పెంచుతూ వ్యాపారులనుంచి పెద్ద మొత్తంలో స్పందన వచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. లక్ష ఉన్న తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షలకు పెంచగా, ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైనా సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

గతంలో నాలుగు స్లాబులను 2011 జనాభా ఆధారంగా 6 స్లాబులకు పెంచడంతోపాటు, గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలకు దుకాణాల పనివేళలు ఉదయం 10నుంచి రాత్రి 11 గంటలవరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించింది. దరఖాస్తులకు జిల్లా వారీగా ఈనెల 9 తర్వాత కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. లైసెన్సుల జారీనాటికి ఎవరూ రాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను టీఎస్‌బిసిఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీబీసిఎల్‌నుంచి మద్యం కొనుగోళ్లపై వ్యాపారుల టర్నోవర్‌ టాక్స్‌ను 8శాతంగా నిర్ణయించిన ప్రభుత్వం, లైసెన్సు ఫీజుకంటే ఏడాదిలో 7రెట్లు మించిన అమ్మకాలపై 14.5 శాతం అదనపు ప్రివిలేజ్‌ ఫీజును వసూలు చేయనున్నారు. వ్యాపారులకు మద్యం విక్రయాలపై లాభం మార్జిన్‌లను కూడా ప్రకటించారు. ఆర్డినరీ మద్యంపై 27వాతం, మీడియం మద్యంపై 20శాతం, ప్రీమియం, విదేశీ మద్యం, బీర్లపై 20శాతం లాభం మార్జిన్‌ను పాలసీలోనే ప్రకటించారు......

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుపతి :ఆగస్టు 02

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు.

నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 67,728 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 21,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Srinagar: వంతెనపై బాంబు.. నిర్వీర్యం చేసిన దళాలు

జమ్మూకశ్మీర్‌లో పెను ఉగ్రదాడిని భద్రతా దళాలు భగ్నం చేశాయి. శ్రీనగర్‌(Srinagar)-బారాముల్లా (Baramulla) జాతీయ రహదారిపై జంగం ఫ్లైవర్‌ వద్ద సోమవారం ఉదయం పేలుడు పదార్థాలను గుర్తించారు..

దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ను పిలిపించి.. నిర్వీర్యం చేశారు..

ఈ మార్గంలో నిత్యం భద్రతా దళాల కాన్వాయ్‌లు తెల్లవారుజామున ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు భావిస్తున్నారు.

తొలుత ఇక్కడ అనుమానాస్పద వస్తువును గుర్తించడంతో వెంటనే సీఆర్‌పీఎఫ్‌ దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ వస్తువును ఐఈడీగా అనుమానించి.. జమ్మూకశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

వీరితోపాటు సైన్యానికి చెందిన 29వ రాష్ట్రీయరైఫిల్స్‌ బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. అనంతరం బాంబుస్క్వాడ్‌ దానిని సురక్షితమైన ప్రదేశానికి తరలించింది. తర్వాత నియంత్రిత విధానంలో ధ్వంసం చేసింది..

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..

తగ్గుతున్న గోదావరి వరద ప్రవాహం

భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులు

ధవళేశ్వరం వద్ద వరద ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు

కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక

పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.