కాంగ్రెస్ బిజెపి పార్టీలతో తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదు: మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా :జులై 29
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలని ఆ పార్టీలతో తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి పనులకు హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..
బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు, వేలాది మంది రైతుల చావుకు కారణమైందని అన్నారు. మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందన్నారు.
మూడు పంటలు పండాలనే సీఎం కేసీఆర్ను కడుపులో పెట్టుకుని చూసుకుందామన్నారు. ఎవరూ తెలంగాణ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో.. ప్రజలు మీరే ఆలోచన చేయాలన్నారు.
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాంగ్రెస్ చీఫ్ పార్టీ రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారన్నారు. సద్దితిన్న రేవు తలవాలని సీఎం కేసీఆర్ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు.
ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు గురువని ఆయన చెప్పినట్లు వింటున్నారంటూ.. వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ బెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు...
Jul 29 2023, 16:26