/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఇవాళ తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది Yadagiri Goud
ఇవాళ తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుపతి :జులై 26

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ సాధారణగా ఉంది. నేడు శ్రీ వారి దర్శనానికి వెళ్లే వారికి స్వామి వారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం 73,137 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణలో "దూకుడు" పెంచిన బీజేపీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు చేసింది. పోల్ వార్ రూం ఇంచార్జ్‌గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగు ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్టార్టజీ టీంను ఏర్పాటు చేసింది. మీడియా స్టార్టజీ టీం ఇంచార్జ్‌గా జాతీయ నేత శ్వేతను నియమించగా.. ఎంపీ ధర్మపురి అర్వింద్, యోగానందకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.

అలాగే పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, చింతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల‌ కోసం ప్రత్యేకంగా 22 కమిటీలను ఏర్పాటు చేశారు.

ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ ఉండేలా కార్యచరణ రూపొందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా నేరుగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి......

Chandrayaan 3: చివరి భూకక్ష్య పెంపు విజయవంతం.. ఇక జాబిల్లే తరువాయి..

బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన 'చంద్రయాన్‌-3 (Chandrayaan-3)' వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది.

ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన అయిదో కక్ష్య పెంపు (Orbit Raising Manoeuvre)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం విజయవంతంగా నిర్వహించింది.

బెంగళూరులోని 'ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)' నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీంతో చంద్రయాన్‌ ఇప్పుడు 127609 కి.మీ x 236 కి.మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.

ఇదిలా ఉండగా.. భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్‌-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య. దీని తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ విన్యాసాన్ని (TransLunar Injection) ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.

జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటివరకు దశలవారీగా అయిదుసార్లు పెంచి.. చంద్రయాన్‌-3ని జాబిల్లికి చేరువచేస్తున్నారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది..

వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి-- మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, తీసుకున్న ముందు జాగ్రత్తచర్యలను కలెక్టర్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ఉందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియ చేయాలని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో, శిథి లావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదే సందర్భంలో తాను కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నానని, ప్రజా ప్రతినిధులు, యువత కూడా అధికారులకు సహకరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు...

ప్రిలిమ్స్ ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొద్దు: హైకోర్టు

ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను వచ్చే సోమవారం వరకు ప్రకటించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులకు సూచించింది.

కాగా, వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది కోరారు.

దీనికి సమ్మతించిన హైకోర్టు సోమవారం వరకు ఫలితాలు విడుదల చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది....

చినుకు పడితే చిత్తడే.. నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్

చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

ఈరోజు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఉదయమే ఆఫీసు, స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షేక్ పేట్ - రాయదుర్గం మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలోనూ పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అటు సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ రోడ్‌లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్, చాదర్ఘాట్ వైపు ట్రాఫిక్ నిలిచిపోగా.. ఇటు కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెర్‌ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైటెక్ సిటీలోనూ వాహనాలు ఎక్కడివి అక్కడే రోడ్లపై ఉండిపోయాయి. ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు...

MMTS Trains: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి

MMTS Trains: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అయితే రెండు రైళ్లలోని లోక్ పైలట్లు ముందే గమనించి ట్రైన్లను నిలిపివేశారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ప్రయాణికులు కాసేపు టెన్షన్ పడ్డారు. లోక్ పైలట్లు అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడం, ట్రైన్లను నిలిపివేయడంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అదే రెండు రైళ్లు ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఒక రైలును మరో ట్రాక్‌పైకి మళ్లించారు. దీంతో రెండు రైళ్లు వేరే వేరే ట్రాక్‌ల పైనుంచి పెళ్లాయి. ఈ ఘటనతో రెండు ఎంఎంటీఎస్ ట్రైన్లు అరగంటపాటు ఆగిపోయాయి.

అయితే ఈ ఘటనపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు విచారణ చేపడుతున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయనేది ఆరా తీస్తున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగానే ఇలా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో లోపం ఎక్కడ జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు.

కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక కేసులో హైకోర్ట్ సంచలన తీర్పు

కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ను ప్రకటించిన కోర్టు....

వనమా వెంకటేశ్వర్ రావు గెలుపును సవాల్ చేస్తూ 2019 లో హైకోర్టును ఆశ్రయించిన జలగం....

ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని పిర్యాదు లో పేర్కొన్న జలగం వెంకట్రావ్....

సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని తీర్పు నిచ్ఛిన హైకోర్ట్....

సమీప అభ్యర్ధిగా జలగం వెంకటరావును విజేత గా ప్రకటించిన కోర్టు...

తప్పుడు అఫిడవిట్ సమర్పించిందుకు గాను వనమాకు రూ 5 లక్షల జరిమానా,2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే గా అర్హుడు కాదని తీర్పు నిచ్చిన హైకోర్ట్...

పార్లమెంట్‌లో మణిపుర్‌ కల్లోలం: నిమిషాలకే వాయిదా పడిన లోక్‌సభ

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌(Monsoon Session of Parliament) కార్యకలాపాలకు మణిపుర్ అల్లర్ల అంశం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దానిపై ప్రధాని ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది..

ఈ పరిస్థితుల మధ్య మంగళవారం లోక్‌సభ(Lok Sabha) ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. 11 గంటలకు ప్రారంభమైన సభను స్పీకర్ ఓం బిర్లా నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేశారు.

మళ్లీ మధ్యాహ్నం రెండు గంటలకు దిగువసభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్ అంశం, ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటుతో రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగలేదు.

దాంతో ఛైర్మన్ జగదీప్‌ ధనఖడ్ ఎగువ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు. ఇదిలా ఉంటే..

ప్రధాని ప్రకటన చేయాలంటూ పట్టుపడుతున్న విపక్ష ఎంపీలు దానిపై వెనక్కి తగ్గుతాయని ప్రభుత్వం భావించడం లేదు. దాంతో ప్రభుత్వం ఇక బిల్లుల్ని ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..

జులై 29న "షా " హైదరాబాద్ పర్యటన?

తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు.

కార్యక్రమంలో,సోమవారం రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు.

అంతకంటే ముందు మధ్యాహ్నం పార్లమెంటులోని హోంమంత్రి ఛాంబర్లో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కలిశారు.

వరుసగా ఇద్దరు ముఖ్యనేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29న అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు.

ఈలోగా తెలంగాణ ముఖ్య నేతలను పిలిపించి ఏ అంశాలు చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది...