/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా? Yadagiri Goud
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా?

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ మరోసారి చర్చనీయాంశంగా మారారు. ఇటీవల వివిధ అంశాలపై సోషల్ మీడియాలో ఆమె తరచు చేస్తున్న పోస్టులు ఇంటర్నెట్‌లో చర్చగా మారుతున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల మణిపూర్ ఘటనపై రియాక్ట్ అయిన స్మితా సబ ర్వాల్‌కు తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.

నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్ రక్తం వచ్చేలా దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన అంశంలో స్మితా సబర్వాల్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై సత్వరమే స్పందిస్తూ ట్వీట్లు పెడతారు.

ఇప్పుడు మీరు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ దుర్ఘటనపై కూడా స్పందించాలని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేశారు.

రఘునందన్ రావుతో పాటు పలువురు నెటిజన్లు సైతం ఈ అంశాంపై స్మితా సబర్వాల్ రియాక్షన్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార తీరు ఫక్తు రాజకీయ నాయకురాలిగా ఉందని ఇప్పటికే పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్న వేళ నల్గొండ ఘటనపై స్మితా ఎందుకు స్పందించడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే ఘటనలపై రియాక్ట్ కావడానికి క్షణం ఆలస్యం చేయని ఈ ఆఫీసర్.. తెలంగాణలో జరుగుతున్న దురాగతాలపై మాత్రం నోరు మెదపడంలేదని సెటైర్లు వేస్తున్నారు. గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై ఆమె చేసిన పోస్టులను ప్రస్తావిస్తూ.. అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఇంత సెలెక్టివ్ గా ఆలోచించడం ఏంటి.. పెయిడ్ ప్రమోషన్స్ మాదిరిగా సెలెక్టివ్ అంశాల మీదనే రియాక్ట్ అవుతారా?

తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దారుణాలు మీకు కనబడటం లేదా? లేక సమయం లేక స్పందించడం లేదా?అంటూ నిల దీస్తున్నారు.

మరి తాజా విమర్శలపై స్మితా సబర్వాల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

వరద నీటిలో చిక్కుకున్న ఒరిస్సా బస్సు

రంపచోడవరం:జులై 24

ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ గుప్తా బస్సు వరద నీటిలో చిక్కుకుంది. సోమవారం ఉదయం ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్రాకు వచ్చే క్రమంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా,

రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు, నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై అప్పటికే కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరి ఉంది.

తెల్లవారు జామున 4.30 గంటలు కావడంతో వరద నీరు సరిగా కనిపించక పోవడంతో బస్సు వెళ్లి పోతుందిలే అనే ఉద్దేశ్యంతో డ్రైవర్ వరద నీటిలో నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.

ఈ తరుణంలో రహదారి పక్కకు వెళ్లి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన డ్రైవర్ బస్సును ఆపి బస్సులో ఉన్న సుమారు 45 మంది ప్రయాణికులను దించేసాడు. ప్రయాణికులు అక్కడి నుండి మోకాళ్ళ లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ప్రయాణికులు దిగి నడిచి వెల్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు రెవిన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని jcb సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు...

అక్టోబర్‌లో గ్రూప్‌-3 పరీక్ష?

గ్రూప్‌-3 పరీక్ష అక్టోబర్‌ నెలలో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయమై కమిషన్‌ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించి, ఎన్నికలకు ముందే పరీక్ష నిర్వహించాలనే అభి ప్రాయానికి కమిషన్‌ వచ్చినట్టు సమాచారం.

మరో వారం, పది రోజుల్లో గ్రూప్‌-3 పరీక్ష తేదీలను కమిషన్‌ ప్రకటించనున్నట్టు తెలిసింది.

అక్టోబర్‌ నెలలో స్టాఫ్‌ సెల క్షన్‌ కమిషన్‌, ఐబీ పీఎస్‌తోపాటు మిగతా పరీక్షలు ఉన్నాయి.

ఈ నేప థ్యంలో వాటిని పరి గణ నలోకి తీసుకొని గ్రూప్‌-3 పరీక్ష తేదీలను పరి శీలి స్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఉన్న తాధికారి ఒకరు తెలిపారు.

అక్టోబర్‌ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికలలోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్ల డించారు. ఇదిలా ఉండగా

రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్‌-3 క్యాటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు....

కేటీఆర్ కు పలువురు విన్నుత రీతిలో శుభాకాంక్షలు

హైదరాబాద్ :జులై 24

సామాజిక మాధ్యమాల్లో మంత్రి కేటీఆర్‌ చురుగ్గా ఉంటారు. ఇతర రాజకీయనేతలందరి కంటే భిన్నంగా, పూర్తిగా పాజిటివ్‌ ధృక్పథంలోనే సోషల్‌ మీడియాను వినియోగిస్తూ తన ప్రత్యేకతను చాటు కుంటున్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, తన పర్యటనల విశేషాలు పంచు కొంటారు.

ప్రజా సమస్యలను తెలు సుకొనేందుకు, ప్రజలతో తన భావాలను పంచుకొనే వేదికగానే ట్విట్టర్‌ను వినియోగిస్తుంటారు. ‘ఆస్క్‌ కేటీఆర్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలను నుంచి సమ స్యలను తానే స్వయంగా తెలుసుకుంటుండడం విశేషం. ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లా డడమేగాక స్వయంగా ఆయనే ట్వీట్‌ చేస్తుంటారు.

ఆయా భాషల్లో కవితలను కోట్‌ చేస్తూ దేశంలో జరిగే పరిణామాలపై సమ యస్ఫూర్తిగా స్పందిస్తుంటారు. పాజిటివ్‌ దృక్కోణంలోనే విమర్శలను కూడా గుప్పించడం కేటీఆర్‌ ప్రత్యేకత. మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌లో 40.52 లక్షలు, ఫేస్‌బుక్‌లో 11.11 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 13.77 లక్షలు, లింక్‌డిన్‌లో 2.55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

వెల్లువెత్తిన అభిమానం

ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా పలువురు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానేత, మంత్రి కేటీఆర్‌ దేశానికి నాయకత్వం వహించే దిశగా ఎదగాలని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ ఆకాంక్షించారు.

కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా కోలేటి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా పేదరికంతో చదువుకు ఇబ్బందులు పడుతున్న ఇద్దరు విద్యార్థినులకు టీఎస్‌ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌సాగర్‌ ఆర్థిక సాయం అందజేశారు. ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతికి, మీర్‌పేట్‌ టీకేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతున్న మల్లెపాక రాములు కుమార్తె శ్వేత కాలేజీ ఫీజుల కోసం కాలేజీ చదువు పూర్తయ్యే వరకూ రూ.లక్ష చొప్పున అంద జేస్తానని ప్రకటించారు. నవతరం నాయకుడు, యువతరం ఆదర్శనీయుడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు.

మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ అమీర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక పాటల సీడీని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ మాజీ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ దేశానికి అభివృద్ధి నమూనా కావాలన్న కలను సాకారం చేస్తున్న కేటీఆర్‌ వందేండ్లు జీవించాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా జూలూరు శుభాకాంక్షలు తెలిపారు.మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎంపీ సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రెండు వేల మొక్కలు నాటారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం నాగారం గ్రామస్థులు పొలంలో వరితో హ్యాపీ బర్త్‌డే కేటీఆర్‌ అని ఏర్పాటుచేసి, అక్కడే కేక్‌ కట్‌ చేశారు.

ఆపద్బాంధవుడు కేటీఆర్‌

అభాగ్యులకు అండగా నిలువడంలో మంత్రి కేటీఆర్‌ ముందు వరుసలో ఉంటారు. అటెండర్‌ నుంచి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎదిగిన సిరిసిల్ల జిల్లా చీకోడుకు చెందిన పిట్ల నర్సింహులు, ఇంటి కలను సాకారం చేసుకొన్న తంగళ్లపల్లి మండలం రామ చంద్రాపూర్‌కు చెందిన మేడిపల్లి నీలవ్వ, ఐదో అంతర్జాతీయ నేపాల్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన యువ కరాటే ప్లేయర్‌ జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బొలుగుల చందు, కృత్రిమ కాలును అమర్చుకొన్న బీహార్‌ రాష్ట్రం సీవాన్‌కు చెందిన దివ్యాంగురాలు ప్రియాంశు కుమారి జీవితాలే కేటీఆర్‌ మానవీయతకు నిదర్శనాలు.....

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కొనసాగుతోంది

తిరుపతి :జులై 24

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కొనసాగుతోంది. నేడు టోకెన్ రహిత శ్రీవారి సర్వ దర్శనం కోసం 20 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న ఆదివారం శ్రీవారిని 87,792 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

స్వామి వారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరు పతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న శ్రీవారికి 29,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలా వద్దా ❓️ప్రభుత్వం నిర్ణయంపై ఉత్కంఠ..!

భారీ వర్షాలనేపథ్యంలో రేపు,ఎల్లుండి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరోవైపు.. తెలంగాణ సీఎంవో సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి హరీష్ రావులను ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ గంట గంటకూ పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే మూడ్రోజులు గురు, శుక్ర, శనివారాలు వరుసగా సెలవులు ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ సెలవులు పొడిగించాలా..? వద్దా..? అనేదానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే.. రాత్రి పదిలోపు సెలవులపై విద్యాశాఖ నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.

అయితే రేపు, ఎల్లుండి దాదాపు సెలవులు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచేస్తున్నాయి.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కాసింత వర్షం తగ్గింది కానీ.. వరద మాత్రం అలానే ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, రోడ్ల మీదనే చెట్లు కూలిపోవడం, కొన్ని గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులు ఇంకెంత ఇబ్బంది పడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. సోమవారం స్కూల్స్ ఉన్నా మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించాలని.. ఆ రెండ్రోజులు భారీగా వర్షాలు ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఈ డిమాండ్లు వినడం, సోషల్ మీడియాలో చూశాక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి...

కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

కొమురవెల్లి :జులై 23

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయనికి భక్తుల తాకిడి నెలకొంది.

ఆదివారం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు స్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో వెళ్లి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కుల రూపంలో కేషఖండన, అభిషేకం, నిత్య కల్యాణం, గంగరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నరు. భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ గిస భిక్షపతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగ శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుడి మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గు పూజరులు, ఆలయ సిబ్బంది సార్ల విజయ్ కుమార్, నర్సింహులు, మాధవి, తదితరులు భక్తులకు సేవలందించారు.....

Chandrayaan-3: 25న మళ్లీ చంద్రయాన్‌-3 కక్ష్య దూరం పెంపు..

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ నుంచి ఈనెల 14న ప్రయోగించిన చంద్రయాన్‌-3 మిషన్‌కు ఈనెల 25న అయిదోసారి కక్ష్య దూరాన్ని పెంచనున్నారు.‌.

బెంగళూరులోని ఇ్రస్టాక్‌ కేంద్రం శాస్త్రవేత్తలు 25న మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో ఈ ఆపరేషన్‌ చేపట్టనున్నారు.

భూమికి సంబంధించిన కక్ష్యలో ఆఖరిసారిగా చేపట్టే ఆపరేషన్‌తో చంద్రయాన్‌-3 భూమి నుంచి విశ్వంలో చంద్రుడ్ని చేరుకునే దిశగా ప్రయాణిస్తుంది.

ఆగస్ట్‌ 1 నాటికి చంద్రయాన్‌-3 లూనార్‌ ఆర్బిట్‌ (చంద్ర కక్ష్య)కు చేరుకుంటుంది. అక్క డ నుంచి 17 రోజుల పాటు చంద్రుడి చుట్టూ పరి్రభమిస్తూ ఆగస్ట్‌ 23న చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తులో

ప్రపొల్షన్‌ మాడ్యూల్‌ ల్యాండర్‌ను విడిచి పెడుతుంది. అదే రోజు సాయంత్రం ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది..

Pawan kalyan: బైజూస్‌ కాంట్రాక్టుపై పవన్‌ ప్రశ్నల వర్షం.. రూ.750 కోట్ల ఖర్చు ఎవరు భరిస్తారు?

అమరావతి: నష్టాల్లో ఉన్న బైజూస్‌ కంపెనీకి రూ.కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారని ట్విటర్‌ వేదికగా నిన్న ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈరోజు మరికొన్ని ప్రశ్నలు సంధించారు.

'' రాష్ట్ర ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌ లోడ్‌ చేసిన ట్యాబ్‌ల కోసం దాదాపు రూ.580 కోట్లు ఖర్చు చేస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ఒక్కో ట్యాబ్‌ విలువ రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఉంటుంది.

బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌ కంపెనీ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా కంటెంట్‌ లోడ్‌ చేసి ఇస్తామని అంగీకరించారు. వచ్చే ఏడాది మళ్లీ ప్రభుత్వం రూ.580 కోట్లు ఖర్చు చేసి ట్యాబ్‌లు కొననుందా? అని జనసేనాని ట్వీట్‌ చేశారు..

ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన ప్రశ్నలివే..

• బైజూస్‌ కంటెంట్‌ కోసం వచ్చే ఏడాది నుంచి ఖర్చు ఎవరు భరిస్తారు? కంపెనీ వారు ప్రతి ఏడాది ఉచితంగా ఇస్తారా? ఈ విషయంలో క్లారిటీ లోపించింది. 8వ తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం బైజూస్‌ వారు కంటెంట్‌ లోడ్‌ చేసిన ట్యాబ్‌లు ఉచితంగా ఇస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ, బైజూస్‌ సంస్థ మాత్రం ఎక్కడా ఇప్పటి నుంచి ఏటా ఉచితంగా కంటెంట్‌ ఇస్తామని చెప్పలేదు.

• ఒక వేళ కంపెనీవారు ఖర్చు భరించలేకపోతే ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఏపీ ప్రభుత్వమా లేక విద్యార్థులా? ఒకవేళ ప్రభుత్వం భరిస్తే మరో రూ.750 కోట్లు బైజూస్‌ కంటెంట్‌ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

• ఎనిమిదో తరగతి నుంచి 9వ తరగతికి విద్యార్థులు వచ్చినప్పుడు వారి పరిస్థితి ఏంటి? 9వ తరగతి కంటెంట్‌ ఖర్చు ఎవరు భరిస్తారు?

• బైజూస్‌ సంస్థ ఏ మాధ్యమంలో, ఏ సిలబస్‌ అందజేస్తారు? వారు ఏ విధానం ఆధారంగా సిలబస్‌ రూపొందిస్తున్నారు?అని పవన్‌ కల్యాణ్ ట్విటర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు..

చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన వేముల గోపీనాథ్

శాలిగౌరారం: శాలిగౌరారం మండల వాసి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ని ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు వేముల గోపీనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘట్కేసర్ పరిధిలోని పి పి ఆర్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన వేడుకలకు వేముల గోపీనాథ్ హాజరై చామల కిరణ్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శాలిగౌరారం మండల వాసి టిపిసిసి ఉపాధ్యక్షులుగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం అభినందనీయమని,భవిష్యత్తులో ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని పార్టీలకు అతీతంగా జన్మదినాన్ని పురస్కరించుకుని మర్యాదపూర్వకంగా కలిసినట్లు వేముల గోపీనాథ్ వెల్లడించారు..

SB NEWS